MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?

స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?

టాలీవుడ్ లో ప్రపంచ సినిమా సరసన నిలిపిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమాలో నటించడానికి స్టార్లు కూడా పోటీపడుతుండగా.. రాజమౌళి మాత్రం ఓ కమెడియన్ కు అసిస్టెంట్ గా పనిచేశాడని మీకుతెలుసా? ఇదేం కామెడీ కాదు నిజంగానే రాజమౌళి ఓ కమెడియన్ కు అసిస్టెంట్ గా పనిచేశాడు. ఇంతకీ ఎవరా కమెడియన్  ఏంటా కథ? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2025, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాన్ ఇండియా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో భాగమవుతారని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఇప్పుడు రాజమౌళిని సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాజమౌళి కమెడియన్ వేణుమాధవ్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారని మీకు తెలుసా? ఇది నిజజీవితంలో కాదు, సినిమా కోసం మాత్రమే. ఈ సంఘటన 2004లో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాలో జరిగింది. ఈ చిత్రానికి దర్శకుడు కూడా రాజమౌళే.

35

ఈ సినిమాలో వేణుమాధవ్ 'నల్లబాలు' అనే పాత్రలో కనిపిస్తారు. ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో రాజమౌళి వేణుమాధవ్‌కు సహాయకుడిగా, చిన్న పాత్రలో నటించారు. ప్రేక్షకులకు అసలు గుర్తు రాని విధంగా ఆ సన్నివేశం చిత్రీకరించబడింది. అప్పట్లో దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న రాజమౌళి, ఇలా ఒక్క సన్నివేశం కోసం నటించారన్నది చాలామందికి తెలియదు.

45

ఇది మాత్రమే కాదు, రాజమౌళి గతంలో మరెన్నో చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఇటీవలి కాలంలో కూడా కల్కి 2898 AD వంటి సినిమాలలో అతని క్యామియో పాత్రలు చూశాం. దర్శకుడిగా కాకుండా నటుడిగానూ ఆయన ఆసక్తికర పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

 

55
Rajamouli, Mahesh babu,varanasi

Rajamouli, Mahesh babu,varanasi


ఇక మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మరో ఘన విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Recommended image2
చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved