భారతీయుడు 2 ఫ్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఇడియాటిక్ రైటర్..రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు
డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. నిర్మాణ సంస్థకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. దీనితో భారతీయుడు 3 ఉంటుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శంకర్ కూడా ఈ చిత్రంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. నిర్మాణ సంస్థకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. దీనితో భారతీయుడు 3 ఉంటుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. శంకర్ కూడా ఈ చిత్రంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాదాపు 28 ఏళ్ళ క్రితం చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించడమే మైనస్ గా మారింది.
శంకర్ తన మార్క్ ప్రదర్శిస్తూ పదునైన సన్నివేశం ఒక్కటి కూడా పెట్టలేకపోయారు. అయితే రేణు దేశాయ్ భారతీయుడు 2 చిత్రంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పిల్లలు, కుటుంబ విషయాలు మాత్రమే కాకుండా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో సామజిక పరమైన అంశాలపై కూడా స్పందిస్తున్నారు. ఇటీవల రేణు దేశాయ్ యానిమల్స్ పై ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాలని భారీ వర్షాలు ముంచెత్తాయి. శంకర్ పల్లి ప్రాంతంలో వర్షాల కారణంగా కనీసం చోటు కూడా లేకుండా అల్లాడుతున్న ఆవుల్ని, ఇతర పశువుల్ని రేణు దేశాయ్ తన సొంత నిధులతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ దృశ్యాలని కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆవులకు పూజలు చేశారు. యానిమల్స్ విషయంలో రేణు దేశాయ్ చాలా కేరింగ్ చూపిస్తున్నారు.
Also Read: అక్కినేని ఫ్యామిలీలో 'నాగ' అనే పదంతో పేర్లు ఎందుకు ఉంటాయో తెలుసా.. పెద్ద ఫ్లాష్ బ్యాక్
వీధి కుక్కలా విషయంలో కూడా రేణు దేశాయ్ తనవంతు సాయం చేస్తున్నారు. అయితే యానిమల్స్ ని హింసించినా, వాటి పట్ల చెడుగా ప్రవర్తించినా రేణు దేశాయ్ సహించడం లేదు. ఆ కారణంతోనే భారతీయుడు 2 చిత్రంపై ఆమె మండిపడ్డారు. భారతీయుడు 2లో కమల్ హాసన్ విలన్ తో డర్టీ స్ట్రీట్ డాగ్ అనే డైలాగ్ చెబుతారు. మరో సన్నివేశంలో ఆ కుక్కని తరిమి కొట్టండి అనే డైలాగ్ కూడా ఉంటుంది.
దీనిపై రేణుదేశాయ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్ట్రీట్ డాగ్స్ డర్టీ కాదు. వాటిపట్ల ప్రేమ చూపించాలి. ద్వేషం కాదు. ఇలాంటి చిత్రం ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇడియాటిక్ రచయితలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.
రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. భారతీయుడు 2 చిత్రాన్ని దారుణంగా తెరకెక్కించారు అని నెటిజన్లు శంకర్ ని ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ఇకపై దర్శక నిర్మాతలు యానిమల్స్ పై సన్నివేశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో.