MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ ని అలా చూడగానే పడిపోయా.. పవర్‌ స్టార్‌తో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్‌.. ఆ స్టూడియోలో ఇంత జరిగిందా?

పవన్ ని అలా చూడగానే పడిపోయా.. పవర్‌ స్టార్‌తో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్‌.. ఆ స్టూడియోలో ఇంత జరిగిందా?

పవర్‌ స్టార్‌ పనవ్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు కూడా. కానీ వీరి లవ్‌ స్టోరీకి సంబంధించిన తెరవెనుక స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 18 2024, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనేది తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏపీలో వైసీపీ నాయకులు ఆయన మ్యారేజ్‌ గురించి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ వివాదం రచ్చ రచ్చ అవుతూనే ఉంటుంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ మొదట పెద్దలు కుదిర్చీన పెళ్లి చేసుకున్నారు. 1997లో నందినితో ఆయన వివాహం జరిగింది.  
 

28

దాదాపు పదేళ్లు కలిసి ఉన్నారు. కానీ మధ్యలోనే వారి మధ్య గ్యాప్‌ పెరిగింది. 2007లో విడిపోయారు. దానికి కారణం పవన్‌ జీవితంలోకి రేణు దేశాయ్‌ రావడమే. కొంత కాలం ప్రేమించున్న ఈ జంట 2009లో మ్యారేజ్‌ చేసుకున్నారు. అప్పటికే వీరికి అకీరా నందన్‌ జన్మించాడు. పెళ్లి తర్వాత ఆద్య జన్మించింది. ఇద్దరు పిల్లలతో పవన్‌, రేణు జంట హాయిగా సాగింది. 
 

38
Pawan Kalyan

Pawan Kalyan

కానీ అంతలో మరో అలజడి. పవన్‌ లైఫ్‌లోకి మరో అమ్మాయి వచ్చింది. రష్యా నటి అన్నా లెజినెవా వచ్చింది. దీంతో రేణు దేశాయ్‌తో గ్యాప్‌ పెరిగింది. ఇద్దరు కలిసి ఉండలేకపోయారు. ఈ కారణంతో రేణు దేశాయ్‌కి కూడా విడాకులు ఇచ్చాడు పవన్‌. ఈ ఇద్దరు 2012లో విడిపోయారు. వీరి పిల్లలు అకీరా, ఆద్యలను రేణు దేశాయ్‌ నే టేక్‌ కేర్‌ చేస్తుంది. 
 

48

ఇదిలా ఉంటే ఆ మధ్య రేణు దేశాయ్‌ పలు యూట్యూబ్‌ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయా క్లిప్స్ బాగా వైరల్‌ అయ్యారు. తమ మ్యారేజ్‌, పవన్‌తో రిలేషన్‌ గురించి ఆమె చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌తో లవ్‌ ఎలా ప్రారంభమైంది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, మొదట ఎక్కడ కలుసుకున్నారనే రహస్యాలను బయటపెట్టింది రేణు దేశాయ్‌. 
 

58

`బద్రి` సినిమాకి ఆడిషన్‌ జరిగే సమయంలో పవన్‌ని కలిసిందట రేణు. అప్పుడు `తమ్ముడు` సినిమా షూటింగ్‌ అవుతుందట. రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుందట. ఆ సమయంలో కొత్త కుర్రాడు పూరీ జగన్నాథ్‌.. పవన్‌ కళ్యాణ్‌తో `బద్రి` కథని ఓకే చేశాడు. దానికి ఆడిషన్‌ జరుగుతుంది. హీరోయిన్‌ ఆడిషన్‌ చేస్తున్నారు. ఆ కాస్టింగ్‌ కాల్‌లో భాగంగా రేణు దేశాయ్‌ ఆడిషన్‌కి వచ్చిందట. 
 

68

రామా నాయుడు స్టూడియోలో వచ్చి తాను కూర్చున్నానని, ఆ తర్వాత కాసేపటకి జగన్‌ వచ్చాడు. ఆయనతోపాటు పెద్ద హడావుడి కనిపించింది. అప్పుడే హీరో వస్తున్నాడని తనకు అర్థమైందట. మొదట్లో స్టయిల్‌గా ఓ వ్యక్తి వస్తున్నాడు, ఆయన వెనకాల కామ్‌‌గా, సింపుల్‌గా మరో వ్యక్తి కనిపించాడు. కట్‌ చేస్తే ముందు ఉన్నది దర్శకుడు, వెనకాల సింపుల్‌గా ఉన్నది హీరో పవన్‌. 
 

78

వచ్చి అలా తన ముందు కూర్చున్నాడట. అలా చూసిన మరో క్షణంలోనే రేణు దేశాయ్‌ ఫిదా అయిపోయిందట. స్టార్‌ హీరో ఇమేజ్‌, చిరంజీవి లాంటి మెగాస్టార్‌ తమ్ముడు, అంతటి స్టేటస్‌ పెట్టుకుని ఇంత సింపుల్‌గా, కామ్‌గా ఉండటమేంటి అనిపించిందట. ఆ సమయంలో పవన్‌ని అలా చూసిన క్షణమే ఆయనకి పడిపోయిందట రేణు దేశాయ్‌. లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ అంటారుగా, అలానే జరిగిందని, అతన్ని చూడగానే గుండెలో ఏదో గంటలు మోగిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది రేణు. 
 

88

ఆ తర్వాత తనని చూడగానే ఏమనిపించిందని అడిగిందట. ఏమనిపించలేదని, చూడ్డానికి బాగున్నావు, అందంగా ఉన్నావని, మంచి అమ్మాయి అనుకున్నట్టు చెప్పాడట. అయితే తాను ఎక్కువగా మాట్లాడతానని, ప్రతిదీ వాగేస్తానని, కానీ అతను కామ్‌ పర్సన్‌ అని, తక్కువగా మాట్లాడతాడని చెప్పింది రేణు దేశాయ్‌. బయట ఆయనకు కోపం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది, కానీ పవన్‌ బేసింగ్‌గా కామ్‌ పర్సన్‌ అని, ఎక్కువగా మాట్లాడడు, షే పర్సన్‌ అని తెలిపింది రేణు దేశాయ్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved