జీవితంలో తోడు కావాలి.. రేణు దేశాయ్ వరుస పోస్టులు, రెండో పెళ్లి గురించేనా ?
పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్నారు. చాలా రోజుల క్రితం రేణు దేశాయ్ రెండో వివాహం గురించి వార్తలు వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నా
పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్నారు. చాలా రోజుల క్రితం రేణు దేశాయ్ రెండో వివాహం గురించి వార్తలు వచ్చాయి. 2013లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు పొందారు. జీవితంలో తోడు అవసరం అని రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. ఆమె రెండవ వివాహం చేసుకునేందుకు కూడా సిద్ధం అయింది. 2018లో రేణుదేశాయ్ కి ఒక వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది.
కానీ తన ఫియాన్సీ వివరాలని రేణు దేశాయ్ గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత రేణు దేశాయ్ రెండవ వివాహం గురించి ఎలాంటి వార్తలు రాలేదు. అయితే రేణు దేశాయ్ రెండవ వివాహం సీక్రెట్ గా జరిగింది అనే ప్రచారం కూడా ఉంది. దీని గురించి అధికారిక సమాచారం లేదు.
తాజాగా రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్లో చేసిన పోస్ట్ లు ఆమె రెండవ వివాహం గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాయి. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి' అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో.. మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి' అంటూ కామెంట్ పెట్టింది.
చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ ఇలాంటి కామెంట్స్ పెట్టడంతో సహజంగానే రెండవ వివాహం గురించి రూమర్స్ మొదలయ్యాయి. రేణు దేశాయ్ కవితలు రాసే రచయిత కూడా. అలా ఏమైనా ఈ కామెంట్స్ పెట్టిందా.. లేక ఆమె రెండవ వివాహం వైపు అడుగులు వేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ తొలిసారి బద్రి చిత్రంలో నటించింది. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
వివాహానికి ముందే వీరిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. అకీరా జన్మించిన అనంతరం 2009లో పవన్, రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2013లో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన మూడవ భార్య అన్నా లెజినోవాతో జీవిస్తున్నారు. రేణు దేశాయ్ మాత్రం సింగిల్ గా ఉంటోంది. మరి రేణు దేశాయ్ రెండవ పెళ్లి వార్త ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.