రెండో పెళ్లి అందుకే క్యాన్సిల్ చేసుకున్నా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటా, అకిరా నాకు చెప్పింది ఇదే
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ పెరుగుతోంది.
అయితే పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన జీవితం గురించి ఆలోచించలేదు. అయితే కొంతకాలం రేణు దేశాయ్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సలహాతో రెండవ పెళ్ళికి సిద్ధం అయింది. ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ పెళ్లి జరగలేదు. ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు రేణు దేశాయ్ పేర్కొంది.
ప్రస్తుతం రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుండడంతో ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, రేణు దేశాయ్ పాత్ర ఎలా ఉండబోతోంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రేణు దేశాయ్ ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈ ఇంటర్వ్యూలలో రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి, ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ నుంచి విడిపోయే సమయంలో అకిరా, ఆద్య చిన్నపిల్లలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు రెండవ పెళ్లి చేసుకోమని చెబుతూ వచ్చారు.
Pawan Kalyan-Renu Desai
కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యుల సలహాతో సెకండ్ మ్యారేజ్ కి ఒకే చెప్పా. నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ ఫోటోలని కూడా నేనే సోషల్ మీడియాలో షేర్ చేశా. అవి బాగా వైరల్ అయిపోయాయి. ఆ సమయంలో ఆద్య వయసు 7 ఏళ్ళు. ఇంకా చిన్న పిల్ల. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అతనికి సమయం కేటాయించాలి అలాగే ఆద్యకి కూడా సమయం కేటాయించాలి.
Renu Desai
అది చాలా కష్టం అనిపించింది. స్నేహితులు కూడా ఆ విషయంలో సలహా ఇచ్చారు. అందుకే ఆ పెళ్లి చేసుకోలేదు. ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నా అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. నా పిల్లలు చాలా స్వీట్. నీకు ఎవరైనా వ్యక్తి నచ్చితే, అతనితో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకో అమ్మా అని అకిరా నాకు చెబుతుంటాడు అని రేణు దేశాయ్ పేర్కొంది. ఇప్పుడు ఆద్య వయసు 13 ఏళ్ళు. మరో రెండు మూడేళ్ళ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటా అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.