ప్రేమ అన్నింటినీ లాగేసుకుంటుంది, రేణు దేశాయ్ నుంచి ఊహించని కామెంట్స్ వైరల్
రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా జంతువుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. జంతువుల కోసం ఆమె స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.

Renu Desai
రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా జంతువుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. జంతువుల కోసం ఆమె స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె టాలీవుడ్ లో నటించిన చిత్రాలు, పవన్ కళ్యాణ్ తో ప్రేమ పెళ్లి, విడాకులు లాంటి విషయాలు గుర్తుకు వస్తాయి.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య సంతానం. అయితే పవన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకోవడం వార్తల్లో ఎక్కువగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచుగా పరోక్ష వ్యాఖ్యలతో పోస్ట్ లు చేస్తుంటారు.
Renu Desai
తన పిల్లలు అకిరా, ఆద్య ఫోటోలని రేణు దేశాయ్ ఫ్యాన్స్ తో పంచుకుంటుంటారు. తాజాగా రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ పై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె ఏమని పోస్ట్ చేశారో తెలుసుకుందాం. 'ప్రేమే అంతా, ప్రేమ అన్నీ ఇస్తుంది, మళ్ళీ తిరిగి అన్నింటినీ లాగేసుకుంటుంది' అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్యల అర్థం ఏంటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక పవన్, రేణు దేశాయ్ తనయుడు అకిరా సినీ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. రెండు దేశాయ్ కి కూడా ఇటీవల అకిరా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అకిరా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే తనకు కూడా ఇష్టమే అని రేణు దేశాయ్ తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మహా కుంభ మేళా కి వెళ్ళినప్పుడు అకిరా కూడా కనిపించాడు. అతడి లుక్ ఫ్యాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది.