- Home
- Entertainment
- రామ్ చరణ్ చేతికి అకీరా నందన్ హీరోగా ఎంట్రీ బాధ్యతలు, `ఓజీ`లో గెస్ట్ రోల్.. రేణు దేశాయ్ క్రేజీ రియాక్షన్
రామ్ చరణ్ చేతికి అకీరా నందన్ హీరోగా ఎంట్రీ బాధ్యతలు, `ఓజీ`లో గెస్ట్ రోల్.. రేణు దేశాయ్ క్రేజీ రియాక్షన్
Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. `ఓజీ` సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారనే టాక్ వినిపించింది. మరోవైపు హీరోగా పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారనే వార్తలు వచ్చాయి. మరో రెండేళ్లలో అకీరా హీరోగా పరిచయం కాబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అకీరా ఎంట్రీ బాధ్యతలు అన్నయ్య రామ్ చరణ్ తీసుకున్నాడనే టాక్ నడుస్తుంది. దీనిపై అమ్మ రేణు దేశాయ్ స్పందించింది. ఆమె ఏం చెప్పిందనేది చూస్తే..

akira nandan, ram charan, renu desai
Renu Desai : టాలీవుడ్‌లో స్టార్ వారసులు హీరోలుగా రావడం కామన్‌గా జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, కృష్ణ వారసులుగా మహేష్ బాబు, కృష్ణంరాజు వారసులుగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. చిరు వారసుడిగా రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్నారు.
ఇప్పుడు మూడో తరం వారసుల ఎంట్రీకి సమయం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసుడుకి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. పవన్ కొడుకు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారనేది మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఇటీవల అకీరా నందన్‌కి సంబంధించిన క్రేజీ వార్తలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఓజీ` చిత్రంలో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తారని, ఇందులో చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారని, చిన్నప్పుడు పవన్‌గా అకీరా కనిపిస్తాడనే చర్చ నడిచింది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.
renu desai
మరోవైపు రామ్ చరణ్.. అకీరా బాధ్యతలు తీసుకున్నాడని, హీరోగా తనే పరిచయం చేస్తాడనే కొత్త వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అకీరా మదర్ రేణు దేశాయ్ స్పందించారు. ఆమె ఈ రూమర్స్ ని ఖండించారు.
ఇలాంటి రూమర్స్ గతంలోనూ విన్నాను అని, అప్పుడు కూడా చెప్పాను, మళ్లీ చెబుతున్నాను, అకీరా ఇప్పుడు ఏ సినిమా చేయడం లేదని తెలిపారు. `ఓజీ`లో నటిస్తున్నారనేది పూర్తిగా ఫేక్ అని చెప్పారు.
renu desai
ఇక అకీరా నందన్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు చరణ్ తీసుకున్నాడనే వార్తలను కూడా ఆమె ఖండించారు. చరణ్ లాంటి అన్నయ్య అకీరాకి ఉన్నందుకు ఆనందంగా ఉందని, కానీ అకీరాని చరణ్ హీరోగా పరిచయం చేస్తాడనేది నిజం కాదని, అవి కేవలం పుకార్లు మాత్రమే, వాటిని ఎవరూ నమ్మొద్దు అని తెలిపారు.
renu desai
అకీరా నందన్ తనకు సినిమాల్లోకి రావాలని ఉందని అడిగితే బహిరంగంగా నేనే ప్రకటిస్తానని, ఆ విషయంలో ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే అని చెప్పారు రేణు దేశాయ్. ఇప్పుడు ఇద్దరూ అకీరా, ఆధ్య స్టడీస్‌పై ఫోకస్ పెట్టారని, వారికి మరో ఆలోచన లేదని తెలిపారు.
వాళ్లు భవిష్యత్‌లో ఏమవుతారనేది వారి ఇష్టమని, ఆ విషయంలో తన ఒత్తిడి ఏం లేదన్నారు రేణు దేశాయ్. మొత్తంగా అకీరా నందన్ సినిమా ఎంట్రీకి సంబంధించిన ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రన్ సింహకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ విషయాలను వెల్లడించారు.