Ibomma: 10 కోట్లతో నిర్మిస్తే 70 కోట్ల వసూళ్లు, ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వర్షన్
Ibomma: అసిఫ్ అలీ నటించిన కిష్కింద కాండం, బాసిల్ జోసెఫ్ నటించిన సూక్ష్మ దర్శిని చిత్రాలు ఇటీవల ఓటీటీలో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీ లో విడుదలై సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

RekhaChithram Movie OTT
అసిఫ్ అలీ, బాసిల్ జోసెఫ్ లాంటి మలయాళీ నటులు ఓటీటీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల బాగా చేరువయ్యారు. అసిఫ్ అలీ నటించిన కిష్కింద కాండం, బాసిల్ జోసెఫ్ నటించిన సూక్ష్మ దర్శిని చిత్రాలు ఇటీవల ఓటీటీలో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీ లో విడుదలై సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఆ చిత్రం పేరు 'రేఖాచిత్రం'. అసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించారు. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రేఖాచిత్రం మూవీ ఈ ఏడాది సంక్రాంతికి మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అసిఫ్ అలీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు రాబట్టింది. జోఫీన్ టీ చాకో దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రాన్ని సోని లివ్ లో రిలీజ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులు సోనీ లివ్ ని అంతగా పట్టించుకోరు. ఇప్పుడు తాజాగా మార్చి 14 నుంచి ఆహా ఓటీటీలో రేఖాచిత్రం మూవీ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ మొదలైంది. మిస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ చేత కేక పెట్టించేలా ఉన్నాయి.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. బెట్టింగ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన కేరళ పోలీస్ అధికారి వివేక్ (అసిఫ్ అలీ) సస్పెండ్ అవుతాడు. 40 ఏళ్ళ క్రితం జరిగిన యువతి హత్య కేసుని ఛేదించేందుకు తిరిగి వివేక్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఒక వృద్ధుడు ఆ అమ్మాయిని తానే హత్య చేశానని ఫేస్ బుక్ లైవ్ లో చెబుతాడు. ఆ వృద్ధుడికి, మరణించిన అమ్మాయికి సంబంధం ఏంటి ? దీని వెనుక అసలు సంగతి ఏంటి ? అనేది మిగిలిన కథ. ఒక్కో ఆధారాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మైండ్ బ్లాక్ చేస్తాయి.

అయితే ఈ చిత్రం ఇలా ఓటీటీలో రిలీజ్ అయిందో లేదో వెంటనే ఐబొమ్మ షాకిచ్చింది. ఐబొమ్మలో ఈ చిత్రం లీక్ అయింది. వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చింది.

