టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలు విప్పి అలా చేస్తా.. తెలుగు బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. నేడు న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ లో కూడా విజయం సాధించిన ఫైనల్ చేరాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. నేడు న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ లో కూడా విజయం సాధించిన ఫైనల్ చేరాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అంతే కాదు టీమిండియా మూడవసారి వరల్డ్ కప్ గెలవాలని భారతీయులంతా కోరుతున్నారు.
అయితే కొందరు సెలెబ్రిటీలు టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తెలుగు బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న రేఖా భోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. స్ట్రీకింగ్ అంటే వెస్ట్రన్ దేశాల్లో బీచ్ లో బట్టలు విప్పి సంతోషంతో పరిగెత్తడం. న్యూడ్ గా వైజాగ్ బీచ్ లో పరిగెడతా అంటూ రేఖా భోజ్ దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది.
దీనితో నెటిజన్లంతా బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి రేఖా భోజ్ రిప్లై కూడా ఇచ్చింది. ఎలాగోలా ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది సెలెబ్రిటీలు చేసే కామెంట్స్ ఇవి అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనికి రేఖా భోజ్ రిప్లై ఇస్తూ.. లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీం పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు.
బట్టల్లేకుండా పరిగెత్తడం సరైన నిర్ణయమేనా అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. క్రికెట్ అనేది అల్టిమేట్ ఎమోషన్.. వరల్డ్ కప్ మూమెంట్ కి లిమిట్ లేదు అని సమాధానం ఇచ్చింది.
2011లో శృంగార తార పూనమ్ పాండే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. తాను ఇచ్చిన మాట ప్రకారం జట్టు ముందు న్యూడ్ డ్యాన్స్ చేస్తానని కూడా పూనమ్ పేర్కొంది. అయితే ఆమెపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.