- Home
- Entertainment
- రీసెంట్ గా పెళ్లి.. భర్తతో పాటు రెండు రోజులు చెన్నై వరదలో చిక్కుకుపోయిన నటి, చివరికి ఏం జరిగిందంటే
రీసెంట్ గా పెళ్లి.. భర్తతో పాటు రెండు రోజులు చెన్నై వరదలో చిక్కుకుపోయిన నటి, చివరికి ఏం జరిగిందంటే
తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్ కూడా నటిగా రాణిస్తున్నారు. రీసెంట్ గా రెండు నెలల క్రితమే కీర్తి పాండియన్ మరో ప్రముఖ యువ నటుడు అశోక్ సెల్వన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇటీవల మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నైలో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. చెన్నై నగరంలో తుఫాను కలిగించిన నష్టం అంతా ఇంత కూడా. వేలాది ఇల్లు నీట మునిగాయి. చాలా మందికి తుఫాన్ తీరని నష్టాన్ని మిగిల్చింది. కొన్ని రోజుల పాటు చెన్నై నగరం స్తంభించిన పోయిన సంగతి తెలిసిందే.
చివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసాన్ని కూడా వరద నీళ్లు చుట్టుముట్టినట్లు వార్తలు వచ్చాయి. వరద బాధితుల్ని ఆదుకునేందుకు చాలా మంది సెలెబ్రిటీలు విరాళాలు అందించారు. అయితే ఒక షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్ కూడా నటిగా రాణిస్తున్నారు. రీసెంట్ గా రెండు నెలల క్రితమే కీర్తి పాండియన్ మరో ప్రముఖ యువ నటుడు అశోక్ సెల్వన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం కీర్తి పాండియన్ తన భర్త అశోక్ సెల్వన్ తో కలసి మైలాపూర్ లోని డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్డులో ఓ ఇంటిలో నివాసం ఉంటోంది. కొత్తగా పెళ్లైన జంటకి మిచౌంగ్ తుఫాన్ ఊహించని షాకిచ్చింది. వీరి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. దీనితో రెండు రోజుల పాటు ఇద్దరూ వరదలో చిక్కుకుపోయారు.
రెస్క్యూ టీం కూడా రెండు రోజుల తర్వాతే ఆ ప్రాంతానికి వచ్చి వీరిని రక్షించారట. ఈ విషయాన్ని కీర్తి పాండియన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వరదవల్ల తాను తన భర్త ఎన్ని ఇబ్బందులు పడ్డామో వివరించింది.
keerthi pandian
ఈ వరదకి కారణం తుఫాన్ కాదని.. తప్పు ప్రభుత్వాలదే అని ఆరోపిస్తోంది కీర్తి పాండియన్. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఎంత పెద్ద వర్షం పడినా చుక్క నీరు నిలిచేది కాదట. కానీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల రోడ్లు ఇష్టానుసారం తవ్వేసి అసంపూర్తిగా వదిలేశారట. దీనితో సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో వరద ముంచెత్తింది అని కీర్తి పాండియన్ ఆరోపించింది ఆ దృశ్యాలని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.