Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ ప్రస్థానం, సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ డిటేయిల్స్.!
రెబల్ స్టార్ కృష్ణం రాజు (Rebel Star Krishnam Raju) ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలోనూ, కీలక పాత్రల్లో నటించిన కొన్ని సూపర్ హిట్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణం రాజు ఈరోజు ఉదయం 3 గంటలకు మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, తెలుగు సినిమా ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన ఆయన.. సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఈ సందర్భంగా టాప్ సూపర్ హిట్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం.
రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎన్నో మరిచిపోలేని చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ శాతం విజయాలు సాధించిన సినిమాల్లో ఆయనది రౌధ్రం, అన్యాయాలు, తిరుగుబాబు లాంటి రెబలిజం ఉన్న పాత్రలే. అందుకే ఆయన రెబల్ స్టార్ కృష్ణం రాజుగా సినీ చరిత్రలో మిగిలిపోయారు. ఆయన కేరీర్ లో దాదాపుగా 50 సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
1969లో వచ్చిన ‘బుద్ధిమంతుడు’ చిత్రం కృష్ణం రాజు కేరీర్ లోనే తొలి సూపర్ హిట్ ఫిల్మ్. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వర్ రావు ప్రధాన పాత్రలో నటించగా.. కృష్ణం రాజు సపోర్టింగ్ రోల్ లో కనిపించారు. అద్భుమైన పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. దీని తర్వాత విడుదలైన ‘మనుషులు మారాలి’ చిత్రంతోనూ కృష్ణం రాజు మరో సూపర్ హిట్ ఫిల్మ్ ను అందుకున్నారు.
ఇలా సూపర్ హిట్ ఫిల్మ్స్ జాబితాలో.. పవిత్ర బంధం, రైతు కుటుంబం, రాజమహల్, మంచిరోజులొచ్చాయి, మానవుడు ధానవుడు, బడిపంతులు (బ్లాక్ బాస్టర్), ఇల్లు - ఇల్లాలు (బ్లాక్ బాస్టర్), ఊరికి ఉపకారి, జీవన తరంగాలు, శ్రీవారు మావారు, స్నేహబంధం, మాయదారి మల్లిగాడు (బ్లాక్ బాస్టర్), గుండెలు తీసిన మొనగాడు చిత్రాలు ఉన్నాయి.
ఆ తర్వాత 1974లో వచ్చిన బంట్రోతు భార్య, ఆ తర్వాత వచ్చిన కృష్ణవేణి ( బ్లాక్ బాస్టర్) చిత్రాలుగా నిలిచాయి. అలాగే.. ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప (బ్లాక్ బాస్టర్), అమరదీపం (ఇండస్ట్రీ హిట్), మనవూరి పాండవులు, రంగూన్ రౌడీ (బ్లాక్ బాస్టర్), వినాయక విజయం, సీతారాములు, త్రిశూలం (బ్లాక్ బాస్టర్), అడవి సింహాలు, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మన్న, అంతిమ తీర్పు, టూటౌన్ రౌడీ, బావ - బామ్మర్ది, నీకు నేను నాకు నువ్వు, రుద్రమా దేవి సినిమాలు సూపర్ హిట్ ఫిల్మ్స్ గా నిలిచాయి.
1966లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కృష్ణం రాజు 190కి పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణ కుమారితో కలిసి కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘చిలకా గోరింక’ ఆయన మొదటి చిత్రం. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత హిట్, సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీ రామరావు, అక్కినేని నాగేశ్వర్ రావు చిత్రాల్లోనూ నటించారు. యాంటి హీరో రోల్స్, విలన్, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించి తనముద్ర వేసుకున్నారు. అలాగే ఇతర భాషా చిత్రాలు ‘హాయ్ బెంగళూరు’,‘సింహడ మరి’ల్లోనూ నటించారు.