ఆ వ్యాధికి కృష్ణం రాజు నాటు వైద్యం చేస్తే ఇక తిరుగులేదు..లక్షల మందికి సాయం, హీరోయిన్ సోదరుడికి కూడా
కృష్ణం రాజు సాయం అంటూ వచ్చి అడిగిన వారిని వెంటనే ఆదుకునే మనస్తత్వం కలవారు. కృష్ణం రాజులో అరుదైన ప్రతిభ ఉందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు స్వయంగా చెప్పారు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. కృష్ణం రాజు మొగల్తూరు నుంచి వచ్చిన నటుడు. తన సొంత ఊరు మొగల్తూరుకి కృష్ణం రాజు ఎంతో సేవ చేశారు అని చాలా మంది కొనియాడుతుంటారు.
కృష్ణం రాజు సినిమా రంగంలోనూ, రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. కృష్ణం రాజు వారసుడిగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణం రాజు సాయం అంటూ వచ్చి అడిగిన వారిని వెంటనే ఆదుకునే మనస్తత్వం కలవారు. కృష్ణం రాజులో అరుదైన ప్రతిభ ఉందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు స్వయంగా చెప్పారు.
అదేంటంటే.. కామెర్ల వ్యాధికి కృష్ణంరాజుకు నాటు వైద్యం తెలుసట. తన వంశ పారంపర్యంగా కృష్ణంరాజు ఆ వైద్యం నేర్చుకున్నారు. ఎంత డబ్బు సంపాదించినా నాకు తృప్తి లేదు..సినిమా రంగంలో ఎంత పేరు తెచ్చుకున్నా తృప్తి లేదు. నాకు తృప్తి నిచ్చింది ఒక్కటే. రాజకీయాల్లో ఉన్నప్పుడు కృష్ణంరాజు మా ఊరికి మంచి పని చేశారు అని ఎవరైనా చెబితే సంతోషంగా ఉంటుంది.
అదే విధంగా కామెర్లకు నాకు నాటు వైద్యం తెలుసు. సినిమాల్లోకి రాక ముందు కూడా ఆ వైద్యం చేసేవాడిని. కొన్ని లక్షల మందికి కామెర్లకి మందు ఇచ్చి ఉంటా. ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు అని కృష్ణంరాజు తెలిపారు. కామెర్లు బాగా ఎక్కువై కొందరు నా దగ్గరకి వచ్చి.. మేము బతుకుతాం అనే నమ్మకం లేదు అంటూ బాధపడినవారు ఉన్నారు. అలాంటి వాళ్లకు కూడా మందు ఇచ్చా. రెండవ రోజు వచ్చి కాస్త పర్వాలేదు సార్ అని అంటారు.. మూడవరోజు తగ్గిపోయింది సార్ అని సంతోషంతో చెబుతారు.
వారి మాటలే నాకు నిజమైన సంతృప్తి నిచ్చాయి అని కృష్ణంరాజు అన్నారు. తన డ్రైవర్లు, ఇంట్లో పని చేసేవాళ్ళు, అలాగే చిత్ర పరిశ్రమలో చాలా మందికి కృష్ణంరాజు కామెర్లకి మందు ఇచ్చారట. జయప్రద సోదరుడుకి కూడా కృష్ణంరాజు కామెర్ల మందు ఇచ్చారు. స్వయంగా జయప్రద ఈ విషయాన్ని రివీల్ చేశారు.