‘మౌనరాగం’ శ్రావణి ఆత్మహత్య, ఫొటోలతో బ్లాక్ మెయిల్

First Published 9, Sep 2020, 8:05 AM

తెలుగు పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టీవి సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.  రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న శ్రావణి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దాంతో టీవి పరిశ్రమలో విషాదం నెలకొని ఉంది. అయితే అసలు ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటనే విషయమై ధర్యాప్తు జరుగుతోంది. అందుకు కారణాలు బంధువులు, తల్లి, తండ్రులు ఏమి చెప్తున్నారంటే...

గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రావణి తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. ‘మౌనరాగం’, ‘మనసు మమత’ లాంటి పలు సీరియల్‌లో ఆమె నటిస్తున్నారు.

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్‌ ఫ్లోర్‌లో నివాసముంటున్నారామె. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో  టిక్ టాక్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది.

తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను. శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగి, వాటిని బయటపెడతానని డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బంధువులు ఆరోపించారు.

వేధింపులు అధికం కావడంతో ఇటీవల ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

దేవరాజుని కఠినంగా శిక్షించాలని శ్రావణి సోదరుడు డిమాండ్ వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అతడిపై ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ఆమె మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్లింది. లోపల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించారు.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

loader