- Home
- Entertainment
- రష్మిక కెరీర్ పై దెబ్బ కొడుతున్న మేనేజర్, అతడి వల్లే నితిన్ మూవీ నుంచి అవుట్.. తెరవెనుక జరిగింది ఇదేనా ?
రష్మిక కెరీర్ పై దెబ్బ కొడుతున్న మేనేజర్, అతడి వల్లే నితిన్ మూవీ నుంచి అవుట్.. తెరవెనుక జరిగింది ఇదేనా ?
కొన్ని వారాల క్రితం నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన టాలీవుడ్ లోకి ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడం, అలాగే గ్లామర్ పరంగా కూడా ఈ బెంగళూరు భామ క్లిక్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి హిట్స్ తో రష్మిక టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.
ఇక ఆమె వ్యక్తిగత వ్యవహారాలు, రూమర్స్ కూడా రష్మికకి ప్లస్ అయ్యాయి. రష్మిక తరచుగా తన పర్సనల్ మ్యాటర్స్ తో వార్తల్లో ఉంటూనే ఉంది. అయితే ఇటీవల శ్రీలీల సునామి మొదలు కావడంతో రష్మిక జోరుకి బ్రేకులు పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మేనేజర్ తో వివాదం కూడా రచ్చ రచ్చగా మారింది. రష్మికకి మేనేజర్ గా వ్యవహరించిన కిరణ్ అనే వ్యక్తి ఆమె వద్ద ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే వార్తలు వచ్చాయి.
దీనిపై రష్మిక ఎప్పుడూ పబ్లిక్ గా మాట్లాడలేదు. మేనేజర్ వ్యవహారం గురించి రూమర్స్ వస్తున్న తరుణంలో ప్రొఫెషనల్ గా తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి వివాదానికి ముగింపు పలకాలని చూశారు. తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏదో గొడవ వల్లే రష్మిక కిరణ్ ని మేనేజర్ గా తొలగించినట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని అంతా భావిస్తున్న తరుణంలో రష్మిక.. తాను నటిస్తున్న ఓ క్రేజీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు బలమైన వార్తలు మొదలయ్యాయి.
కొన్ని వారాల క్రితం నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్. అలాంటి హిట్ కాంబినేషన్ నుంచి రష్మిక ఎందుకు తప్పుకుంది ? పైకి మాత్రం డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. కానీ లోపల పెద్ద వ్యవహారమే జరిగినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. దీనితో మరోసారి ఆమె మేనేజర్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
రష్మిక నితిన్ మూవీ నుంచి తప్పుకోవడానికి కారణం ఆమె మాజీ మేనేజర్ కిరణ్ అంటూ ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనప్పటి నుంచి మాజీ మేనేజర్ రష్మికకి వ్యతిరేకంగా నిర్మాతలు, దర్శకుల వద్ద ప్రచారం మొదలు పెట్టాడట. రష్మిక టాలీవుడ్ లో స్టార్ అయినప్పటికీ బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనితో మాజీ మేనేజర్.. రష్మికకి టాలీవుడ్ పై ఆసక్తి లేదని.. ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే అంటూ లేనిపోనివి కల్పించి నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
అంతే కాదు రష్మికకి ప్రత్యామ్నాయంగా అతడు శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ల పేర్లని మేకర్స్ దగ్గర ప్రస్తావిస్తున్నాడట. ఈ వ్యవహారం రష్మిక దృష్టికి రావడంతో మనస్తాపానికి గురైందో లేక పౌరుషానికి వెళ్లిందో కానీ ఆమె స్వయంగా నితిన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి రష్మిక ఒక రోజు షూటింగ్ లో కూడా పాల్గొందట. కానీ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్మిక ఎగ్జిట్ తో ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. పుష్ప నిర్మాతలు కూడా వాళ్లే. ఈ ఎఫెక్ట్ పుష్ప 2పై పడకుండా వాళ్ళేమైనా ఇష్యూని సెటిల్ చేస్తారేమో చూడాలి.
అలాగే పరశురామ్, విజయ్ దేవరకొండ సెకండ్ కాంబినేషన్ లో ముందుగా రష్మిక నే అనుకున్నారట. కానీ అక్కడ కూడా మాజీ మేనేజర్ అడ్డుపడ్డట్లు ఓ ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి కొత్త భామల హవా.. మేనేజర్ తో వివాదం పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు.