దుల్కర్ కు తెలుగులో వరస సినిమాల వెనక షాకింగ్ సీక్రెట్
కేరళకు చెందిన దుల్కర్ .... మళయాళంలో సినిమాలు తగ్గించి,తెలుగులో సినిమాలు సైన్ చేస్తున్నారు. అందుకు కారణం ఏమిటి

మళయాళం నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఓ స్టార్ హీరోకు కొడుకుగా సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. అన్ని విధాల తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు దుల్కర్ సల్మాన్. తన ప్రతిభతోనే ఒక్కోమెట్టూ ఎక్కుతూ స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు దుల్కర్. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా దుల్కర్ తనదైన పంథాలో సాగుతున్నాడు. అయితే చిత్రంగా మళయాళంలో సినిమాలు తగ్గించి,తెలుగులో సినిమాలు సైన్ చేస్తున్నారు. అందుకు కారణం ఏమిటి
Kalki 2898 AD
తండ్రి మమ్ముట్టి మళయాళ చిత్రసీమలో తనదైన స్టైల్ లో ఇప్పటికి స్టార్ గా సాగుతున్నారు.ఆయన ఫామ్ లో ఉండగానే దుల్కర్ దృష్టి సైతం సినిమా రంగంపైకి మళ్ళింది. పర్డ్యూ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేసిన దుల్కర్ కొద్ది రోజులు దుబాయ్ లో బిజినెస్ మేనేజర్ గా పనిచేశాడు. ‘బ్యారీ జాన్ స్టూడియో’లో మూడు నెలల యాక్టింగ్ కోర్సు చేశాడు దుల్కర్.
Kalki 2898 AD
ఆ తర్వాత మళయాళంలో 2012లో ‘సెకండ్ షో’ అనే సినిమాతో దుల్కర్ హీరోగా పరిచయం అయ్యాడు. అదే యేడాది అతను నటించిన ‘ఉస్తాద్ హోటల్’లోనూ నటునిగా మంచి పేరు వచ్చింది. ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు దుల్కర్. తరువాత నుంచీ మళయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలోనూ నటించడం మొదలు పెట్టాడు.
తమిళ చిత్రం ‘వాయై మూడి పేసవుమ్’ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించాడు దుల్కర్. దాంతో మణిరత్నం దృష్టిలో పడ్డాడు. ‘ఓ కాదల్ కన్మణి’లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో అనువాదమయింది. ఈ చిత్రంతో తెలుగువారిని ఆకట్టుకున్నాడు దుల్కర్.
ఆ తర్వాత 2018లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో జెమినీగణేశన్ గా నటించి అదరకొట్టాడు. అయితే అందులో విజయ్ దేవరకొండ, సమంత ఉన్నారు. మహానటి పాత్రలో కీర్తి సురేష్ నటించి క్రెడిట్ మొత్తం ఆమెకు వెళ్లిపోయింది. అయితే అప్పటికే దుల్కర్ ఇక్కడ ప్రూవ్ అయ్యిపోయారు.
దుల్కర్ సల్మాన్‍కు సీతారామం చిత్రంతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. టాలీవుడ్‍లో తన తొలి చిత్రంతోనే దుల్కర్ భారీ హిట్ అందుకున్నారు. హను రాఘవవూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన సీతారామం బ్లాక్‍బస్టర్ అయింది. ఆ బ్యానర్‌తో దుల్కర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఆ బ్యానర్ నిర్మించిన కల్కి 2898 ఏడీ చిత్రంలోనూ అతడు ఓ క్యామియో రోల్ చేశారు. ప్రస్తుతం తెలుగులోనే లక్కీ భాస్కర్ చిత్రం చేస్తున్నారు దుల్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న లక్కీ భాస్కర్ చిత్రంకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ అయ్యి ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ పెంచింది. ఈ మూవీలో బ్యాంకు ఉద్యోగిగా దుల్కర్ పని చేస్తుంటారు. ఈ సినిమా షూటింగ్‍లో దుల్కర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
లక్కీ భాస్కర్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే వచ్చిన శ్రీమతి గారు సాంగ్ మంచి హిట్ అయింది. లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేస్తున్నారు.
ఇప్పుడు, మరో తెలుగు మూవీకి ఓకే చెప్పారని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పైనే ఆ సినిమాను దుల్కర్ సల్మాన్ చేయనున్నారని సమాచారం. అనౌన్స్‌మెంట్ డేట్ కూడా బయటికి వచ్చింది. అయితే ఇలా దుల్కర్ వరసపెట్టి సినిమాలు చేయటానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది.
dulquer salmaan
అందుతున్న సమాచారం మేరకు మళయాళం నుంచి ఎక్కువగా మీడియం బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి. వరసపెట్టి వచ్చిన పెద్ద బడ్జెట్ మళయాళ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే అక్కడ ఓటిటి రేట్లు తక్కువ పలుకుతున్నాయి. నెట్ ప్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వారు..మళయాళంలో వచ్చే పెద్ద సినిమాలపై ఆసక్తి చూపటంల లేదు.చిన్న సినిమాలే కొంటున్నారు. చిన్న సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా రెమ్యునరేషన్స్ పెద్దగా ఉండవు. అలాగే మళయాలం దాటవు. ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు సెట్ అవటం లేదు. ఈ నేపధ్యంలో దుల్కర్ కు తెలుగులో కంఫర్ట్ గా ఉంది. ఇక్కడ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి దుల్కర్ తో సినిమా చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే తెలుగులో వరసపెట్టి దుల్కర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.