MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • దిల్ రాజుని తక్కువ అంచనా వేయద్దు... షాకింగ్ డెసిషన్ ..వెనక అసలు మేటర్ ఇదే?!

దిల్ రాజుని తక్కువ అంచనా వేయద్దు... షాకింగ్ డెసిషన్ ..వెనక అసలు మేటర్ ఇదే?!

 హైదరాబాద్, విజయనగరం, కర్నూల్, ఏలూరు నగరాల్లోని థియేటర్ల వివరాలు ఇచ్చారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నెటిజన్లు మాత్రం దిల్ రాజు కాంపౌండ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్నారు.

2 Min read
Author : Surya Prakash
Published : Apr 23 2024, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


దిల్ రాజు ఏం చేసినా చాలా ఆలోచించి అడుగులు వేస్తారు. ఆయనకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో అనుభవం ఉంది. ఆ ఎక్సపీరియన్స్ ఆయన నిర్ణయాలలో కనపడుతుంది. సినిమాలు హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ప్రక్కన పెడితే బిజినెస్ విషయంలో ఆయన్ను కొట్టిన వాళ్లు లేరు. అలాగే హీరోలను లాంచ్ చేయటంలో, వాళ్లను నిలబెట్టే సినిమాలు ప్లాన్ చేయటంలో ఆయనకి ఆయనే సాటి అంటారు. సినిమాలు రిలీజ్ టైమ్ లో వేరే సినిమాలు మార్కెట్లో ఏమున్నాయో చూడటం, థియటర్స్ లో ఏ సినిమాకు ఎక్కువ ఎక్కడ రెస్పాన్స్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లటం దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అయితే  ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే తన సోదరుడు శిరీష్ కుమారుడైన ఆశిష్ రెడ్డి(Ashish Reddy)ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) రీ రిలీజ్. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు లేదా చిన్న హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ చేయడం సహజం. కానీ ఒక కుర్ర హీరో నటించిన బిలో యూవరేజ్ మూవీని రీ రిలీజ్ చేస్తుండటం ఏమిటనే డిస్కషన్ మొదలైంది.

36


 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాకి పలువురు స్టార్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్‌.మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అయితే 2022 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

46


  ఎవరూ ఊహించని విధంగా 'రౌడీ బాయ్స్'ని మళ్ళీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. 'రౌడీ బాయ్స్' చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో మళ్ళీ సందడి చేయనుందని తెలుపుతూ.. హైదరాబాద్, విజయనగరం, కర్నూల్, ఏలూరు నగరాల్లోని థియేటర్ల వివరాలు ఇచ్చారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నెటిజన్లు మాత్రం దిల్ రాజు కాంపౌండ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు తమదైన శైలిలో ట్రోల్ కూడా చేస్తున్నారు.అయితే అసలు కారణం వేరే ఉందని అంటున్నారు.

56


అదేమిటంటే ఇప్పుడు ఆశిష్ హీరోగా కొత్త చిత్రం వస్తోంది. బేబీ సినిమాతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ చిత్రంగా ఆశిష్ - వైష్ణవి చిత్రం రానుంది.   ఈ చిత్రానికి లవ్‍మీ (Love Me) టైటిల్ ఖరారు చేసింది మూవీ టీమ్. ఇఫ్ యూ డేర్ (ఒకవేళ ధైర్యం ఉంటే) అనే క్యాప్షన్ ఈ టైటిల్‍కు ఉంది. ముక్కలైన లవ్ సింబల్‍పై లవ్‍మీ టైటిల్ ఉంది. ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఆషిష్ రెడ్డిని జనం మర్చిపోయి ఉంటారు. మళ్లీ ఒక్కసారి గుర్తు చేసి ఈ లవ్‍మీ సినిమా రిలీజ్ చేస్తే బెస్ట్ అని ప్లాన్ చేసి రౌడీబాయ్స్ ని రీరిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. 

66


 మనిషి, దెయ్యం మధ్య ప్రేమ అనే స్టోరీ లైన్‍తో లవ్‍మీ సినిమా వస్తోంది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. హారర్ రొమాటింక్ మూవీగా లవ్‍మీ రానుంది. లవ్‍మీ సినిమా రిలీజ్ డేట్‍ను మూవీ యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే అతి త్వరలోనే  రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ సమర్పిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved