రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?
Ram Charan first crush: మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. హ్యాండ్సమ్ గా, ఫిట్ గా ఉండటమే కాదు, మంచి నటుడు, మంచివాడు, అందగాడు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా రామ్ చరణ్ కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. చరణ్ అంటే పడిచచ్చి పోతారు. అంత ప్రేమ వారికి. రామ్ చరణ్ అంటే సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇష్టపడతారు. ఓ హీరోయిన్ అయితే తన ఫస్ట్ క్రష్ రామ్ చరణే అంటోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏ సినిమాల్లో నటించింది.

Ram Charan first crush: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. అసలే ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో మరో ప్లాప్ మూవీ పడకుండా.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నాడు. దాంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్.
రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ ఫోస్టర్ తో పాటు, పెద్ది ఫస్ట్ గ్లింప్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాపై భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా.. సుకుమార్ ఈసినిమాకు కథను అందించారు. ఈమూవీ తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.
ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఓన్ గా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అంతే కాదు చరన్ కు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సాధారణ లేడీ ప్యాన్స్ కాదు.. రామ్ చరణ్ అంటే హీరోయిన్లు కూడా తెగ ప్రేమించేస్తుంటారు. రీసెంట్ గా ఓ హీరోయిన్ తన ఫస్ట్ క్రష్ రామ్ చరణ్ అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు రవితేజ్ హీరోయిన్ కావ్య థాపర్. రవితేజతో ఈగల్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఏక్ మినీకథ, బిచ్చగాడు 2, డబుల్ ఇస్మార్ట్ శంకర్, ఊరుపేరు భైరవకోన, విశ్వం లాంటి సినిమల్లో నటించి మెపించింది.
Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఇక ఈబ్యూటీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ క్రష్ ఎవరని అడగ్గా.. రామ్ చరణ్ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో చరణ్ తన ఫేవరెట్ హీరో అని.. తను ఎంతో క్యూట్ గా నవ్వుతారని, చాలా హ్యండ్సమ్ గా ఉంటారని తెలిపింది. కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ అమ్మడు చెర్రీతో కలిసి సినిమా చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. కావ్య థాపర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
Also Read: చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?