Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌ని వెన్నుపోటు పొడిచిన రతిక.. బిగ్ బాస్ టైటిల్ రేసులో రైతు బిడ్డ..?
రైతు బిడ్డ కార్డ్ తో బిగ్ బాస్ తెలుగు 7 లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. ఎంతో ఇన్నోసెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరికి దగ్గరయ్యాడు. మంగళవారం ఎపిసోడ్‌తో తాను ఎంత బలమైన కంటెస్టెంట్‌గా నిరూపించుకున్నాడు.
బిగ్ బాస్ 7 సీజన్ ఆసక్తికరంగా రన్ అవుతుంది. గత రెండు సీజన్లపై చాలా వ్యతిరేకత వచ్చింది. తక్కువ రేటింగ్ కూడా వచ్చింది. దీంతో ఈ సారి కొత్తగా చేస్తున్నారు. ట్విస్ట్ లు, టర్న్ లతో హౌజ్‌ని నడిపిస్తున్నారు బిగ్ బాస్. ఈ ఏడో సీజన్‌లో ప్రారంభమై పది రోజులు దాటింది. 14 మందితో ప్రారంభం కాగా, మొదటి వారంలో కిరణ్ రాథోర్ ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌లో పెద్దగా గేమ్ ఆడలేని వారిని హౌజ్ నుంచి పంపించేస్తున్నారు.
ఇక రెండో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం రంజుగా జరిగింది. ఇందులో అత్యధికంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ని ఎనిమిది మంది నామినేట్ చేశారు. అదే సమయంలో అతన్ని దారుణంగా ఆడుకున్నారు. రైతు బిడ్డ కార్డ్ వాడుకుంటున్నావని, సింపతీ గెయిన్ చేస్తున్నాడని, హౌజ్‌లో ఎక్కువగా రతిక చుట్టే తిరుగుతున్నాడని అందరు ఆరోపించారు. యాక్టింగ్ చేస్తున్నావని అన్నందుకు యాక్టర్ కష్టాలేంటో తెలుసా? అంటూ శోభా శెట్టి విరుచుకుపడింది.
మరోవైపు రతిక కూడా పెద్ద షాకిచ్చింది. ఇన్నాళ్లు పల్లవి ప్రశాంత్‌తో కలిసి తిరిగింది. ఆయన నచ్చావంటే నవ్వింది. ఆయన చుట్టూ తిరిగింది. నువ్వు నా గుండెలో ఉన్నావంటే సంతోషించింది. ఎందుకు నేనంటే ఇష్టం అంటూ గుచ్చి గుచ్చి అడిగింది. తనపై ఉన్న అభిప్రాయమేంటో అందరి ముందు చెప్పమని గోల చేసింది. ఆద్యంతం సరదాగా గడిపారు. పల్లవి ప్రశాంత్ తో పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్లేట్ తిప్పేసింది. దీనిపై నెటిజన్ల నుంచి, బిగ్ బాస్ రివ్యూవర్స్ నుంచి నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
పల్లవి ప్రశాంత్‌కి రతిక వెన్నుపోటు పొడిచిందంటున్నారు. పల్లవి ప్రశాంత్ తనతో పులిహోర కలుపుతున్నాడని మొదట్నుంచి ఆమెకి తెలుసు. తనకు ఇష్టం లేకపోతే ఆ రోజే కట్ చేయాల్సింది. ఎందుకు ఇన్ని రోజులు లాగింది. సడెన్‌గా ఎందుకు రివర్స్ అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుందని, పల్లవి ప్రశాంత్‌ని ఓ రకంగా బకరాని చేసిందని అంటున్నారు. మంగళవారం నామినేషన్ల సమయంలో వీరిద్దరి టాపిక్ ప్రస్తావనకు రాగా, నేనెప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? అని ప్రశాంత్ అడగ్గా.. అబ్బో.. చేసిందేంటి? అంతా అనుకునేది అదే కదా, దాని మీనింగ్ ఏంటి? అంటూ రివర్స్ అయ్యింది.
ఈ విషయంలో రతిక ఫేక్ పర్సన్ అని అంటున్నారు నెటిజన్లు. ఆమె అసలు రూపం బయటపడిందంటున్నారు. ప్రశాంత్ చేసేది నచ్చకపోతే ఆ రోజే కట్ చేయాల్సింది, ఇన్ని రోజులు ఎందుకు కొనసాగించావని శివాజీ ప్రశ్నించగా, రతిక వద్ద ఆన్సర్ లేదు, ఇదే ఆమె అసలు రూపాన్ని స్పష్టం చేస్తుందని కామెంట్ చేస్తున్నారు. అందరు పల్లవి ప్రశాంత్ కంటెంట్ ఇస్తుంటే వారంతా వెనకబడిపోతున్నారని, ఆ ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్‌లోకి వెళ్తున్నారని, అందుకే పల్లవి ప్రశాంత్‌ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రైతు బిడ్డ సంపతి అతను కొట్టేస్తే తమ పప్పులు ఉడకవని భావించి, అంతా కట్టుకుని చేస్తున్న కుట్ర అని బిగ్ బాస్ వ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో తెలియకుండానే పల్లవి ప్రశాంత్‌ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుస్తున్నారు. ఎనిమిది మంది ఒక్కడినే టార్గెట్ చేశారు, అది కూడా ఒకే కారణంతో అంటే వారంతా అతని విషయంలో భయపడుతున్నారనే అభిప్రాయానికి వస్తున్నారు. వాళ్లు ఏం చేయలేక అతనిపై పడ్డారని, కానీ ఇదంతా అది ప్రశాంత్‌కే ప్లస్ అవుతుందని, అతనే మరింత ఎలివేట్ అవుతున్నాడని, తెలియకుండానే వాళ్లంత కలిసి పల్లవి ప్రశాంత్‌ని టాప్‌లోకి తీసుకెళ్లారని ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు టైటిల్ రేస్‌లో ఉండే సత్తా అతనిలో ఉందని, కాకపోతే ఆట తీరు మార్చుకోవాలని అంటున్నారు. ప్రేమ, దోమలు కాకుండా తన గేమ్పై ఫోకస్ పెట్టి, లాజికల్‌గా ఆడితే టాప్ 5లో ఉంటాడని చెబుతున్నారు. హౌజ్‌లో జరిగే పరిణామాలు కూడా అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.