రైతు బిడ్డతో ఆ పని చేయమన్న నెటిజన్... వాడికి అంత బుర్రలేదన్న రతిక రోజ్, కామెంట్ వైరల్
రతిక రోజ్ బిగ్ బాస్ 7 సెన్సేషన్స్ లో ఒకరు. ఆమె అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. పల్లవి ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు జనాలకు నచ్చలేదు. తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన రతిక రోజ్... పల్లవి ప్రశాంత్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది.
Rathika Rose
రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్లో పక్కా ప్రణాళికతో అడుగుపెట్టింది. బయట పీఆర్ టీం ని ఏర్పాటు చేసుకుంది. హౌస్లో తన ప్రవర్తన ఆధారంగా బయట ఎలాంటి ప్రచారం చేయాలో ముందే చెప్పి వెళ్ళింది.
Rathika Rose
మొదటి వారంలోనే ఎమోషనల్ కంటెంట్ స్టార్ట్ చేసింది. తల్లిదండ్రుల కంటే కూడా తన ఎక్స్ లవర్ ని మిస్ అవుతున్నట్లు కన్నీరు పెట్టుకుంది. ఆ ఎక్స్ లవర్ రాహుల్ సిప్లిగంజ్ అని బయటున్న పీఆర్ టీమ్ ప్రచారం చేశారు. రతిక - రాహుల్ సిప్లిగంజ్ కలిసి దిగిన ఫోటోలు లీక్ చేశారు.
దీనిపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఆయన పరోక్షంగా రతిక రోజ్ పై విమర్శలు చేశాడు. తమ ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకుంటుందని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టాడు. దాంతో రతిక రోజ్ ప్లాన్ రివర్స్ అయ్యింది.
Rathika Rose
ఇక పల్లవి ప్రశాంత్ ని లైన్లో పెట్టే ప్రయత్నం చేసింది. అతన్ని ట్రాప్ చేసింది. తీరా రెండో వారం నామినేషన్స్ లో అతన్ని టార్గెట్ చేసింది. ఈ పరిణామం రతిక రోజ్ పై నెగిటివిటీకి కారణమైంది. అందుకే నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో హౌస్లో మరలా అడుగుపెట్టింది. బయట పరిస్థితులు చూసిన రతిక రోజా పల్లవి ప్రశాంత్, శివాజీలతో సన్నిహితంగా ఉంది. అది ఏమంత వర్క్ అవుట్ కాలేదు. బీబీ ఉత్సవం షోలో పాల్గొన్న రతిక... పల్లవి ప్రశాంత్ కి సారీ చెప్పింది.
తాజాగా రతిక రోజ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఓ నెటిజన్.. పల్లవి ప్రశాంత్ తో లవ్ ఫ్రాంక్ చేయాలని అడిగాడు. దానికి సమాధానంగా... లవ్ ఫ్రాంక్ ని అర్థం చేసుకునేంత తెలివితేటలు పల్లవి ప్రశాంత్ కి లేవు. అతడు చాలా సున్నితం. అలాగే నేను ప్రేమ విషయంలో ఫ్రాంక్స్ చేయను... అని సమాధానం చెప్పింది.
రతిక రోజ్ కామెంట్ వైరల్ అవుతుంది. మరో నెటిజెన్ లవ్ స్టేటస్ గురించి అడగ్గా... నేను సింగిల్ అని సమాధానం చెప్పింది. రతిక రోజ్ నటిగా కొనసాగాలని ప్రయత్నం చేస్తుంది. ఆమె కల ఈ మేరకు నెరవేరుతుందో చూడాలి...