MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..

Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..

భర్త విజయ్ దేవరకొండకు స్టేజ్‌పైనే చెమట తుడిచి, మీసం సరిచేసి రష్మిక తన ప్రేమను చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట చేసిన మంచి పని కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 17 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిల్వర్ స్క్రీన్ పై హిట్ జంట..
Image Credit : Asianet News

సిల్వర్ స్క్రీన్ పై హిట్ జంట..

సినిమా తెరపై హిట్టు పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంటలు, నిజ జీవితంలోనూ ఒక్కటైతే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాగే, ఫిబ్రవరి 26న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ జంట పెళ్లి కాకముందు ఏదో రకంగా వైరల్ అయ్యారు.. ఇప్పుడు పెళ్లై మూడు నెలలు దాటినా.. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గానే 4‌0 స్కూల్స్ లో స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ లు ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకున్నారు స్టార్ కపుల్.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ దేవరకొండ మీసం తిప్పిన రష్మిక..
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండ మీసం తిప్పిన రష్మిక..

ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఈ జంటకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఈ వెంట్ లో స్టేజ్ పై భర్త విజయ్ దేవరకొండ ముఖానికి పట్టిన చెమటను రష్మిక ప్రేమగా తుడుస్తూ, ఆయన మీసం సరిచేస్తున్న వీడియో అభిమానుల మనసు దోచుకుంటోంది. ఈ కొత్త దంపతుల మధ్య ఉన్న అన్యోన్యతకు, ప్రేమకు ఈ వీడియో అద్దం పడుతోంది. అయితే ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు, దీని వెనుక ఓ పెద్ద బాధ్యత, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒక కథ కూడా ఉంది.

35
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్..
Image Credit : instagram

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి కొన్ని రోజుల ముందు, విజయ్ తండ్రి స్వగ్రామమైన తెలంగాణలోని అచ్చంపేట మండలం, తుమ్మనపేట గ్రామంలోని కొంతమంది విద్యార్థులకు 'దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా సహాయం అందించారు. అప్పుడు అదే స్టేజ్ పై విజయ్, రష్మిక ఓ మాట ఇచ్చారు. 'భవిష్యత్తులో ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన విద్యార్థుల చదువుకు మా వంతు పూర్తి సహాయం అందిస్తాం' అని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ స్టార్ కపుల్ తమ మాట నిలబెట్టుకున్నారు.

45
180 మంది స్టూడెంట్స్ కు స్కాలర్‌షిప్‌లు
Image Credit : Telugu 360

180 మంది స్టూడెంట్స్ కు స్కాలర్‌షిప్‌లు

'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి చదువుతున్న 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. విజయ్ దేవరకొండ తన (X) ఖాతాలో ఈ స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థుల లిస్ట్ ను షేర్ చేశారు. "ఈ స్కాలర్‌షిప్ చాలా చిన్నదే కావచ్చు, కానీ నా గ్రామంలో మొదలైన ఈ ప్రయత్నం రాబోయే రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించాలన్నది నా కల" అని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

55
వైరల్ అవుతున్న విజయ్ రష్మిక వీడియో..
Image Credit : Instagram

వైరల్ అవుతున్న విజయ్ రష్మిక వీడియో..

అయితే ఇదే కార్యక్రమం మధ్యలో, మండుటెండకు విజయ్ దేవరకొండ ముఖంపై చెమటలు పడుతుండగా, భార్యగా రష్మిక వెంటనే స్పందించింది. అందరూ చూస్తుండగానే విజయ్ చెమటను తుడిచి, ఆయన మీసాన్ని ప్రేమగా సరిచేసింది. ఈ అందమైన క్షణం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీల్ లైఫ్‌లో సూపర్ హిట్ జోడీ అయిన వీళ్లు, రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ కపుల్ అని మరోసారి నిరూపించుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image2
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image3
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Related Stories
Recommended image1
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Recommended image2
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved