MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే

Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే

ఫిల్మ్ కెరీర్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నటన విషయంలో చిరంజీవిని కూడా మించిపోయాడు. రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వంగా శభాష్ అని అనుకున్న సదర్భం గురించి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2026, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిరంజీవిని మించిపోయిన రామ్ చరణ్..
Image Credit : our own

చిరంజీవిని మించిపోయిన రామ్ చరణ్..

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కొన్ని విషయాలలో తండ్రిని మించిపోయాడు చరణ్. నటనలో ఎన్నో వేరియేషన్లు చూపిస్తూ.. సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తూ.. అభిమానులను అలరించడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు మెగా పవర్ స్టార్. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత కష్టంతో స్టార్ గా ఎదిగాడు చరణ్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, పెద్ది లాంటి సినిమాల్లో చరణ్ కష్టం ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన, పాత్రల కోసం ఆయన చేసిన శ్రమ, తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిరంజీవి రామ్ చరణ్ ను చూసి గర్వపడ్డ క్షణం..
Image Credit : our own

చిరంజీవి రామ్ చరణ్ ను చూసి గర్వపడ్డ క్షణం..

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. డ్యాన్స్ లో, యాక్షన్ సీన్స్ లో వేరియేషన్లు చూపించి మాస్ ఆడియన్స్ పల్స్ ను పట్టగలిగాడు. కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన బాటలో నడిచిన రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు. పెద్ది సినిమా చూసి చిరంజీవి ఎంతో మురిసిపోతున్నారు. చరణ్ చేసిన నటన, ఆసినిమా కోసం అతను పడ్డ కష్టాన్ని తలుచుకుని ఎంతో గర్వపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ ను చూసి చిరంజీవి, ఆయన భార్య సురేఖ గర్వంతో సంతోషించిన మొదటి క్షణం మరోకటి ఉంది. ఈ విషయం గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

34
రామ్ చరణ మొదటి సినిమా టైమ్ లో ఏం జరిగింది?
Image Credit : our own

రామ్ చరణ మొదటి సినిమా టైమ్ లో ఏం జరిగింది?

ఆచార్య సినిమా రిలీజ్ టైమ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రామ్ చరణ్ గురించి, అతని నటన, డెడికేషన్ గురించి మాట్లాడాడు. చరణ్ ను చూసి తాను గర్వపడ్డ మొదటి క్షణం గురించి వెల్లడించారు. చిరు మాట్లాడుతూ..'' చరణ్ ఫస్ట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సురేఖ స్పాట్ కు వచ్చాం.. ఆరోజు చరణ్ బర్త్ డే. షూటింగ్ లో చరణ్ ను చూస్తే నల్లగా కమిలిపోయి ఉన్నాడు.. మాడిపోయి ఉన్నాడు. చరణ్ అలా ఉండటం చూసి, ఎండలో మాడిపోవడం చూసి, నలిగిపోవడం చూసి.. సురేఖ తట్టుకోలేకపోయింది.. అయ్యో పాపం బిడ్డా అంది. నేను మాత్రం వా.. శభాష్.. కష్టపడుతున్నాడు. అన్నీ నేర్చుకుంటున్నాడు. ఇలా కష్టపడితేనే రేపు ఓ స్థాయికి వస్తాడు అని మొదటిసారి గర్వపడ్డాను'' అని అన్నారు. మెగాస్టార్ మొదటిసారి చరణ్ ను చూసి గర్వపడ్డ క్షణం అదే.

44
పెద్దిలో విశ్వరూపం చూపించిన రామ్ చరణ్..
Image Credit : Asianet News

పెద్దిలో విశ్వరూపం చూపించిన రామ్ చరణ్..

రామ్ చరణ్ రీసెంట్ గా పెద్ది’ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ లో రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. సినిమా అంతా తన భుజాలపై మోశాడు మెగా పవర్ స్టార్. సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్‌లో ఆయన చూపించిన ఎమోషనల్ సీన్స్,అభిమానులను కదిలించింది. చరణ్ ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన బాడీని మూడు పాత్రలకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. చరణ్ కష్టం అంతా పెద్ది సినిమాలో కనిపించింది. సినిమా కోసం ఎంత సాహసం చేయడానికి అయినా ఆయన వెనకాడటంలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Related Stories
Recommended image1
Youtuber Nandu: దోషిగా తేలితే యూట్యూబర్ నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా? యూకే నుంచి బ్యాగు సర్దుకోవాల్సిందేనా?
Recommended image2
Anchor Sreemukhi: శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved