MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • గ్లోబ్‌ ట్రోటర్‌లో ప్రియాంక చోప్రా పాత్ర ఇదే.. పేరుతోనే ఆమె రోల్‌ ఎలా ఉంటుందో చెప్పిన రాజమౌళి

గ్లోబ్‌ ట్రోటర్‌లో ప్రియాంక చోప్రా పాత్ర ఇదే.. పేరుతోనే ఆమె రోల్‌ ఎలా ఉంటుందో చెప్పిన రాజమౌళి

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న `గ్లోబ్ ట్రోటర్‌` నుంచి ప్రియాంక చోప్రా పాత్ర ఫస్ట్ లుక్‌ వచ్చింది. ఆమె పేరుతోనే అసలు కథ చెప్పారు రాజమౌళి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 12 2025, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంచనాలను పెంచిన `గ్లోబ్‌ ట్రోటర్‌`లోని పృథ్వీరాజ్‌ లుక్‌
Image Credit : X

అంచనాలను పెంచిన `గ్లోబ్‌ ట్రోటర్‌`లోని పృథ్వీరాజ్‌ లుక్‌

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, భారతీయ సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాల్లో రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న `గ్లోబ్‌ ట్రోటర్‌‌` ముందు వరుసలో ఉంటుంది. ఈ మూవీ నుంచి త్వరలో టైటిల్‌, టీజర్‌ని విడుదల చేయబోతున్నారు రాజమౌళి. ఇప్పటికే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రని పరిచయం చేశారు. ఆయన కుంభ అనే విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. వీల్‌ చైర్‌లో కూర్చొని కోపంగా చూస్తున్న పృథ్వీరాజ్‌ లుక్‌ ఆకట్టుకుంది. ఆ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌ ఎలిమెంట్లు ఉన్నాయా అనే సందేహాలను రేకెత్తించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్‌ బాబు పాత్రని తెలియజేసేలా సంచారి పాట
Image Credit : Asianet News

మహేష్‌ బాబు పాత్రని తెలియజేసేలా సంచారి పాట

ఆ తర్వాత మంగళవారం `గ్లోబ్‌ ట్రోటర్‌` సినిమాలోని హీరో పాత్రని తెలియజేసేలా పాటని విడుదల చేశారు. ఈ పాటని శృతి హాసన్‌ పాడటం విశేషం. ఈ పాట సైతం ఆద్యంతం కట్టిపడేసింది. ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. కీలక పాత్రలో నటిస్తోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా పాత్రని పరిచయం చేశారు. ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు రాజమౌళి.

Related Articles

Related image1
`ది గర్ల్‌ ఫ్రెండ్‌` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న రష్మిక మందన్నా
Related image2
ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఈమె ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.. అనుష్క, సాయి పల్లవి కాదు
35
గ్లోబ్ ట్రోటర్‌ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌
Image Credit : Asianet News

గ్లోబ్ ట్రోటర్‌ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌

ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఇందులో `ప్రపంచ వేదికపై భారతీయ సినిమాని పునర్నిర్వచించిన మహిళ, మన అమ్మాయికి తిరిగి స్వాగతం. మందాకినిగా మీ విభిన్నమైన ఛాయలను ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను` అని పేర్కొన్నారు రాజమౌళి. ఫస్ట్ లుక్‌తోనే ఆమె పాత్రపై అంచనాలను పెంచారు. అదే సమయంలో ఆయన ప్లాన్‌ ఊహకందని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లుక్‌లో ప్రియాంకచోప్రా చీరకట్టుకుని ఉంది. హై హీల్స్ ధరించింది. చేతిలో తుపాకీతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఏడారి, కొండల ప్రాంతంలో ఆమె ఈ రకమైన సాహసం చేస్తూ కనిపించడం విశేషం. దీంతో ఈ లుక్‌ ఊహకందని విధంగా ఉందని చెప్పొచ్చు.

45
మందాకిని పాత్ర వెనుక స్టోరీ ఇదేనా
Image Credit : Asianet News

మందాకిని పాత్ర వెనుక స్టోరీ ఇదేనా

అయితే ఆమె పాత్రని బట్టి చూస్తే, ప్రియాంక చోప్రా రోల్‌ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మందాకిని పురాణాలకు సంబంధించిన పాత్రతో పోల్చితే మందాకిని రావణుడి సోదరి, అగస్త్యుడి భార్య. రాముడు, సీత వనవాసంకి వచ్చినప్పుడు వారికి హెల్ప్ చేసే పాత్ర మందాకినిది. ఈ లెక్కన చూస్తే సినిమాలో పైకి నెగటివ్‌ షేడ్‌తో కనిపించినా, హీరోకి సపోర్ట్ చేసే పాత్రలో ప్రియాంక చోప్రా కనిపిస్తుందని తెలుస్తోంది. ఆమె పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్ ఉంటాయని రాజమౌళినే తెలిపారు.  రామాయణంలోని మందాకిని పాత్ర తరహాలో ప్రియాంక పాత్ర జర్నీ ఉంటుందనిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ వెనకాల చాలా కథ ఉందని మాత్రం అర్థమవుతుంది.

55
`గ్లోబ్‌ ట్రోటర్‌` రహస్యం బయటపెట్టబోతున్న రాజమౌళి
Image Credit : Asianet News

`గ్లోబ్‌ ట్రోటర్‌` రహస్యం బయటపెట్టబోతున్న రాజమౌళి

మహేష్‌ బాబు హీరోగా రూపొందుతున్న `గ్లోబ్‌ ట్రోటర్‌` మూవీని ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో రూపొందిస్తున్నారని, ఇందులో మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన పాటలోనూ సంచారి అంటూ వర్ణించారు. ఈ పాట ఆయన పాత్ర తీరుతెన్నులను మరింతగా రిఫ్లెక్ట్ చేసిందని చెప్పొచ్చు. కొంత జేమ్స్ బాండ్‌ తరహాలో, మరికొంత ఇండియా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందనిపిస్తోంది. ఇలా అన్నీ మిక్స్ చేసి సరికొత్తగా ఈ మూవీని రూపొందిస్తున్నారట రాజమౌళి. అయితే ఈ సినిమాకి `వారణాసి` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఇదే టైటిల్‌ నిజమైతే భారతీయ పురాణాల నేపథ్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఇలా అనేక సస్పెన్స్ అంశాలతో మూవీపై అంచనాలను పెంచుతున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు రాజమౌళి. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. అందులో ఈ సినిమా గురించి అన్ని విషయాలు చెప్పబోతున్నారు. అదే సమయంలో టైటిల్‌ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. దీంతో దీనికోసం అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. దీనికంటే ముందే మహేష్‌ ఫస్ట్ లుక్‌ కూడా రాబోతుంది. దీని కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
`ది గర్ల్‌ ఫ్రెండ్‌` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న రష్మిక మందన్నా
Recommended image2
ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఈమె ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.. అనుష్క, సాయి పల్లవి కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved