MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఈమె ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.. అనుష్క, సాయి పల్లవి కాదు

ప్రభాస్‌కి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఈమె ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.. అనుష్క, సాయి పల్లవి కాదు

Prabhas Favorite Heroine: ప్రభాస్‌ని ఇష్టపడే హీరోయిన్లు చాలానే ఉన్నారు. కానీ ఆయనకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు. అలనాటి హీరోయిన్లలో ఆయన ఫేవరేట్‌ ఎవరో తెలిపారు డార్లింగ్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 12 2025, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రభాస్‌
Image Credit : youtube/bahubali movie

ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రభాస్‌

ప్రస్తుతం పాన్‌ ఇండియా ఇమేజ్‌ని దాటి గ్లోబల్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు ప్రభాస్‌. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఇండియా మీడియా సైతం ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ అంటూ వర్ణించింది. ప్రస్తుతం అత్యధిక సినిమాల లైనప్‌తో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఆరు సినిమాలున్నాయి. రెండు చిత్రీకరణ దశలో ఉండగా, మరో మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో మూడు సినిమాలు వచ్చే ఏడాది స్టార్ట్ కానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమాల్లోకి వచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్‌
Image Credit : Asianet News

సినిమాల్లోకి వచ్చి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్‌

అయితే ప్రభాస్‌ ఈ మంగళవారం(నవంబర్‌ 11)న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 23ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన `ఈశ్వర్‌` మూవీతో తెలుగు తెరకి హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2002 నవంబర్‌ 11న విడుదలైంది.  పెద్దగా ఆడలేదు. `బాహుబలి`కి ముందు ప్రభాస్‌కి మూడే బ్లాక్‌ బస్టర్స్ ఉన్నాయి. `వర్షం`, `ఛత్రపతి`, `మిర్చి` మాత్రమే పెద్ద హిట్‌ అయ్యాయి. `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`, `డార్లింగ్‌` చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. ఇక `బాహుబలి` చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారతీయ సినిమా కూడా మారిపోయింది. ఇప్పుడు వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

Related Articles

Related image1
శర్వానంద్‌లో మార్పుకి కారణమిదే.. భార్యతో విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
Related image2
`ది గర్ల్‌ ఫ్రెండ్‌` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న రష్మిక మందన్నా
35
త్రిషతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పిన ప్రభాస్‌
Image Credit : Instagram

త్రిషతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పిన ప్రభాస్‌

అయితే ప్రభాస్‌ అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఆయనంటే ఇష్టపడే హీరోయిన్లు కూడా చాలానే ఉన్నారు. ఆయనతో పని చేయాలని కోరుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ ప్రభాస్‌ ఇష్టపడే హీరోయిన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఈ  జనరేషన్‌లో ఇష్టమైన హీరోయిన్‌ సాయిపల్లవి అని చెప్పాడు ప్రభాస్‌. అంతకు ముందు సమంత పేరు కూడా చెప్పాడు. కానీ తనతో పని చేసిన హీరోయిన్లలో మాత్రం త్రిష అంటే ఇష్టమని చెప్పడం విశేషం. అనుష్కతో వరుసగా సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పలేదు డార్లింగ్‌. త్రిషతో `బుజ్జిగాడు` చిత్రంలో నటించారు. ఇందులో త్రిషతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని ప్రభాస్‌ చెప్పడం విశేషం.

45
ప్రభాస్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ సావిత్రి
Image Credit : tcompanion

ప్రభాస్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ సావిత్రి

ఈ తరం హీరోయిన్ల పేర్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కానీ సీనియర్లలో, అలనాటి హీరోయిన్లకి సంబంధించి ప్రభాస్‌ బాగా ఇష్టపడే హీరోయిన్‌ ఎవరో తెలిపారు. తనకు సావిత్రి అంటే ఇష్టమట. తన ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ సావిత్రి అని చెప్పారు ప్రభాస్‌. ఆమెకి సంబంధించిన చాలా సినిమాలు తాను చూసేవాడట. ఆమె నటనకు ఫిదా అయిపోతానని తెలిపారు. `బాహుబలి` మూవీస్‌ చేయడానికి ముందు ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని పంచుకున్నారు. లేటెస్ట్ గా ఇది వైరల్‌గా మారింది.

55
ఆరు సినిమాల లైనప్‌తో ప్రభాస్‌
Image Credit : X

ఆరు సినిమాల లైనప్‌తో ప్రభాస్‌

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తోన్న `ది రాజాసాబ్‌` మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఫాంటసీ హర్రర్‌ రొమాంటిక్‌ కామెడీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. జనవరి 9న ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అలాగే త్వరలో సందీప్‌ రెడ్డితో చేయాల్సిన `స్పిరిట్‌` మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియో కాన్సెప్ట్ ఆకట్టుకుంది. వీటితోపాటు ప్రభాస్‌ `సలార్‌ 2`, `కల్కి 2`, ప్రశాంత్‌ వర్మ మూవీస్‌ చేయనున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
త్రిష
సావిత్రి (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Related Stories
Recommended image1
శర్వానంద్‌లో మార్పుకి కారణమిదే.. భార్యతో విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
Recommended image2
`ది గర్ల్‌ ఫ్రెండ్‌` మూవీ ఐదు రోజుల కలెక్షన్లు.. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న రష్మిక మందన్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved