- Home
- Entertainment
- Rashmika Mandanna: ముక్కుపుడక పెట్టుకుని క్యూట్ లుక్స్ తో చిలిపి పోజులు.. క్రేజీ కుర్రాళ్ల కోసం రష్మిక ట్రీట్
Rashmika Mandanna: ముక్కుపుడక పెట్టుకుని క్యూట్ లుక్స్ తో చిలిపి పోజులు.. క్రేజీ కుర్రాళ్ల కోసం రష్మిక ట్రీట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మరోవైపు రౌడీ బాయ్‌తో లవ్ లో ఉందనే రూమర్లని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఓ క్రేజీ పనిచేసింది.

రష్మిక మందన్నా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగింది. తనకంటూ ఓ ఇమేజ్‌ని, స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతున్న ఈ బ్యూటీ గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతూ ట్రీట్ ఇస్తూనే ఉంది.
అప్పుడప్పుడు అదిరిపోయే అందాల విందు వడ్డిస్తుంది రష్మిక. స్కిన్ షోలో హద్దులు చెరిపేస్తూ బ్లాస్ట్ అవుతుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వదు. అంతగా నెట్టింట రచ్చ చేసే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అందులో భాగంగా తాజాగా క్యూట్ అందాలతో మెరిసింది.
రష్మిక మందన్నా రెండు క్లోజప్ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. కానీ ముక్కుపుడక పెట్టుకుని క్రేజీగా మారింది. క్రేజీగా పోజులిస్తూ కట్టిపడేస్తుంది. రష్మిక ముక్కుపుడక పెట్టుకోవడంతో ఆమె అందం హాట్‌గా మారిపోయింది. కేకపెట్టించేలా ఉంది. ముక్కుపుడుకతో ఈబ్యూటీ అందం మరింత పెరిగిందనే చెప్పాలి.
`ఛలో` సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. ఆ సినిమాతో తొలి విజయాన్ని అందుకుంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి `గీతగోవిందం` చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. వంద కోట్లు వసూలు చేసింది. పది కోట్లు పెడితే వంద కోట్లు వచ్చింది. సుమారు 50కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాతో ఇటు విజయ్ దేవరకొండ, అటు రష్మిక మందన్నా స్టార్ అయిపోయారు. క్రేజీ స్టార్స్ గా రాణిస్తున్నారు. రష్మిక మందన్నా ఆ తర్వాత విజయ్‌తో `డియర్ కామ్రేడ్`, `దేవదాసు` చిత్రాలు చేయగా, ఇవి పెద్దగా ఆడలేదు. ఇక మహేష్‌తో చేసిన `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో రష్మిక నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది.
ఆ వెంటనే `పుష్ప`లో, ఆటు హిందీలో నటించే అవకాశాలు వచ్చాయి. హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాల్లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పటికే రెండు సినిమాలు విడుదలై నిరాశ పరిచాయి. ఇప్పుడు `యానిమల్` చిత్రంతో రాబోతుంది. ఇక తెలుగులో `పుష్ప`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ రాబోతుంది.
Rashmika Mandanna
ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు `పుష్ప2`తో వచ్చే ఏడాది రచ్చ చేయబోతుంది. దీంతోపాటు `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో రాబోతుంది రష్మిక మందన్నా. ఇదిలా ఉంటే నితిన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తప్పుకుంది. హిందీలో వరుణ్ దావన్‌తో ఓ సినిమాకి కమిట్ కావడం వల్ల ఈ సినిమాని వదులుకుంది. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయిందట. ఆ రెండింటిని మిస్ అయ్యింది రష్మిక మందన్నా.