ఫారేన్ కు వెళ్తే రష్మిక మందన్న ఎక్కువగా ఏం కొంటారో తెలుసా? శ్రీవల్లికి ఇంత ఇష్టమా!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తరచుగా ఫారెన్ ట్రిప్పులకు వెళ్తూనే ఉన్నారు. అయితే శ్రీవల్లి తన పని ముగించుకున్నాక విదేశాల్లో కొన్ని ఆసక్తికరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్ళుగా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజ్ దక్కించుకుంటుంది.
ఇటు సౌత్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతుంది. స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చివరిగా యానిమల్ చిత్రంతో వెండితెరపై మెరిసిన విషయం తెలిసింది.
ఇక ఆ సినిమా తర్వాత రాబోయే చిత్రాలపై రష్మిక మందన్న ఫోకస్ చేశారు. ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే ఒక సినిమా పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ వల్లి విదేశాలకు వెళ్లి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో రీసెంట్ గా జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడినుండి ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళింది. విదేశాలను తన అభిమానులను కలిసి సందడి చేసింది. ఇదిలా ఉంటే రష్మిక తాజా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది.
ఆ ఫోటోలు ఏంటో కాదు తను విదేశాల్లో కొనుగోలు చేసిన టాయ్స్ కు సంబంధించినవి. మూడు నాలుగు టెడ్డీ బేర్స్ కొనుక్కుంది. మామూలుగా సెలబ్రెటీలు ఫారిన్ కంట్రీస్ లో క్లాత్, ఖరీదైన వస్తువులు కొంటుంటారు.
అయితే రష్మిక మందన్న మాత్రం ఇలా టెడ్డీబేర్ కొనుగోలు చేసినట్టు తన ఫోటోలతో తెలియజేశారు. దీంతో ఆమెకు టాయ్స్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఇక నెక్స్ట్ Pushpa 2 తో అలరించబోతోంది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.