- Home
- Entertainment
- దుబాయ్‌లో గురిచూసి బాణం వేసిన రష్మిక మందన్నా.. వెనకాల నుంచి వేయిస్తున్నది ఆ స్టార్ హీరోనేనా?
దుబాయ్‌లో గురిచూసి బాణం వేసిన రష్మిక మందన్నా.. వెనకాల నుంచి వేయిస్తున్నది ఆ స్టార్ హీరోనేనా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకుంది. అయితే ఆమె దుబాయ్‌లో ప్రైవేట్‌గా ఈ సెలబ్రేషన్ చేసుకోవడం విశేషం.

రష్మిక మందన్నా.. ఏప్రిల్ 5న బర్త్ డే జరుపుకుంది. అందుకోసం ఆమె దుబాయ్ వెకేషన్ వెళ్లింది. ఫ్యామిలీతో కాకుండా ఆమె ఒంటరిగానే వెకేషన్‌లో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ వెకేషన్ పిక్స్ ని, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది రష్మిక మందన్నా. ఆయా ఫోటోలు, క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక.. ఓ చిన్న వీడియో క్లిప్‌ని షేర్ చేసుకుంది. ఇందులో ఆమె బీచ్ సమీపంలో విల్లు ప్రాక్టీస్ చేసింది. గురి చూసి కరెక్ట్ గా కొట్టింది రష్మిక మందన్నా. కరెక్ట్ గా పాయింట్ మీద తగిలింది. ఈ వీడియో క్లిప్ యమ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా వాట్ ఏ ఫన్ డే అంటూ ఈ పోస్ట్ పెట్టింది రష్మిక. అయితే ఇందులోనే ఓ పెద్ద తిరకాసు ఉంది. ఈ వీడియోలో రష్మిక ఒక్కరు మాత్రమే కాదు, మరో వ్యక్తి కూడా ఉన్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. రష్మిక బాణం వేసిన అనంతరం ఇలా ఇవ్వు అనేలా ఓ చెయి ఆమె వద్దకు వచ్చింది. ఆ చేయి ఎవరిది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అది ఆ స్టార్ హీరోదే అని తేల్చేస్తున్నారు నెటిజన్లు.
రష్మిక మందన్నా.. ప్రస్తుతం రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో లవ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు దొరికిపోయారు. రష్మిక మందన్నే చాలా సార్లు లీకులు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె మరోసారి లీక్ ఇచ్చింది. ఈ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండనే అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
ఆమె వైపు వెనకాల వచ్చిన ఆ చేయి విజయ్ దేవరకొండనే అని అభిమానులు, నెటిజన్లు తేల్చేస్తున్నారు. అయితే విజయ్ కూడా ఈ నెల 4న దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఆయన `ఫ్యామిలీ స్టార్` ప్రమోషన్స్ పూర్తి చేసుకునే రిలీజ్‌కి ముందురోజే వెళ్లిపోయాడు. దీంతో రష్మిక బర్త్ డే కోసమే ఆయన వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ రకంగానూ ఆ వీడియోలో ఉన్నది విజయ్ అని కన్ఫమ్ చేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా `గీతగోవిందం`లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`లో మెరిశారు. దీంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. అప్పట్నుంచి ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. అయితే వీరి ప్రేమ సీరియస్‌గానే అని తెలుస్తుంది. చాలా సందర్భాల్లో రష్మిక.. విజయ్ ఇంటికి వస్తుంది. పండగలు కూడా వాళ్లింట్లోనే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇలా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
విజయ్ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్` ఈ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్‌తో రన్ అవుతుంది. కలెక్షన్లు డల్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రష్మిక మందన్నా `పుష్ప 2`లో నటిస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రేపు ఈ మూవీ టీజర్ రాబోతుంది. దీంతోపాటు `రెయిన్‌బో`, `ది గర్ల్ ఫ్రెండ్`, `కుబేర` చిత్రాల్లో నటిస్తుంది రష్మిక.