Rashmika: రష్మికపై దారుణంగా ట్రోలింగ్.. పార్టీలో నడవలేక నడుస్తూ, ఆ డ్రెస్ అవసరమా..
నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
ఛలో చిత్రంలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు.
ఇటీవల గ్రాండ్ గా జరిగిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో బిటౌన్, సౌత్ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. సౌత్ నుంచి తమన్నా, పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్లు మెరిశారు. కుర్రాళ్ళకి గిలిగింతలు పెట్టే అందాలు చూపిస్తూ అదిరిపోయే కాస్ట్యూమ్స్ ధరించారు.
ఇక రష్మిక బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ గా మెరిసింది. థైస్ స్ప్లిట్ డ్రెస్ లో రష్మిక మతిపోగోట్టే విధంగా మెరిసింది. కానీ ప్రస్తుతం ఆమె ధరించిన డ్రెస్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఆ డ్రెస్ లో రష్మిక చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.
డ్రెస్ కాళ్ళ కిందవరకూ ఉండడంతో నడవడానికి ఇబ్బందిగా మారింది. పైగా థైస్ వద్ద డీప్ గా కటింగ్ ఉండడంతో పదే పడే డ్రెస్ ని అడ్జెస్ట్ చేసుకుంటూ కనిపించింది. ఆ డ్రెస్ లో నడవడమే కష్టంగా ఉంటే.. తరచుగా థైస్ వద్ద అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీనితో రష్మిక చాలా అగచాట్లు పడింది. చివరకి ఎలాగోలా మ్యానేజ్ చేసింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Rashmika Mandanna
అంత ఇబ్బంది పడుతూ ఆ డ్రెస్ ధరించడం అవసరమా అంటూ రష్మికపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. గ్లామర్ గా కనిపించాలంటే చాలా డ్రెస్ లు, కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఇబ్బందిగా ఉన్నా అదే డ్రెస్ ఎందుకు వేసుకోవాలి.. అటెన్షన్ కోసమే రష్మిక ఈ డ్రెస్ లో మెరిసింది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక ఇళయదళపతి విజయ్ 66వ చిత్రంలో నటిస్తోంది.