- Home
- Entertainment
- `పిచ్చెక్కిపోవాల్సిందే`.. `పుష్ప2`, `యానిమల్`, ధనుష్ చిత్రాలపై రష్మిక మందన్నా కామెంట్ వైరల్..
`పిచ్చెక్కిపోవాల్సిందే`.. `పుష్ప2`, `యానిమల్`, ధనుష్ చిత్రాలపై రష్మిక మందన్నా కామెంట్ వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. రెండూ పాన్ ఇండియా మూవీస్. దీనికి ఇటీవల మరో సినిమా తోడైంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ దుమ్మరేపేందుకు వస్తుంది.

రష్మిక మందన్నా.. గ్లామర్ తారగా టర్న్ తీసుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ మంచి నటి కూడా. అద్బుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. హవాభావాలు, డైలాగు డెలివరీ, యాక్టింగ్ చాలా బాగుంటుంది. చాలా మంది హీరోయిన్ల కంటే బెటర్‌గా చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలతోపాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు, అలాంటి సినిమాలొస్తున్నాయి. `పుష్ప` సినిమానే అందుకు నిదర్శనం.
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ నుంచి పాన్ ఇండియా క్రష్‌గా మారింది. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అలరించేందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప2` చిత్రం చేస్తుంది. శ్రీవల్లిగా అలరించేందుకు వస్తుంది. మొదటి భాగంలో ఇప్పటికే రచ్చ చేసింది. ఎంతో మందిని ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో `పుష్ప2`తో రాబోతుంది. ఈ చిత్రంతో మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది నేషనల్ క్రష్.
దీంతోపాటు బాలీవుడ్‌లో `యానిమల్` సినిమా చేస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ దుమ్ములేపుతుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏదో కొత్త పాయింట్‌తో ఈ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇది పాన్ ఇండియా మూవీనే. ఇది డిసెంబర్‌లో రాబోతుంది.
Rashmika Mandanna
మరోవైపు రష్మిక మందన్నా ఇటీవల `ధనుష్` సినిమాకి ఓకే చెప్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వచ్చే ఏడాది ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్ర కథ కూడా అదిరిపోయేలా ఉంటుందట. యాక్షన్ ప్రధానంగా సాగుతుందని, ఓ కొత్త కాన్సెప్ట్ తో సాగుతుందని, ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు.
Rashmika Mandanna
తాజాగా ఈ చిత్రాలపై రష్మిక మందన్నా స్పందించింది. ఈ మూడు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది. మూడు చిత్రాలకు ఉన్న ఓ కామన్ థ్రెడ్‌ని బయటపెట్టింది. ఓ నెటిజన్ ట్విట్టర్ ఈ బ్యూటీని ప్రశ్నించింది. `పుష్ప2`, `యానిమల్`, `డీ51` చిత్రాలకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని నెటిజన్ ప్రశ్నించగా.. అన్నింటికి కలిపి ఓ కామన్ త్రెడ్ ఉందంటూ `ఇవి పిచ్చెక్కించేలా ఉంటాయి` అని పేర్కొంది రష్మిక. దీంతో ఈ బ్యూటీ ట్వీట్ ట్రెండ్ అవుతుంది. ఈ మూడు చిత్రాలు ఆడియెన్స్ కి మెంటల్ ఎక్కించే రేంజ్‌లో ఉంటాయని ఆమె పేర్కొంది.
Rashmika mandanna
ఇదిలా ఉంటే రష్మిక వీటితోపాటు `రెయిన్‌బో` అనే సినిమాలో నటిస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. మరోవైపు తెలుగులో నితిన్‌తో సినిమా చేయాల్సింది. హిందీలో వరుణ్ ధావన్ సినిమా కోసం ఇది వదులుకుందట. కానీ ఆ సినిమా రద్దు అయ్యింది. దీంతో ఈ రెండూ పోయాయి. కొత్త ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది నేషనల్ క్రష్.