MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna : స్టార్ హీరో సినిమాను కాదన్న రష్మిక..? టాలీవుడ్ వద్దు.. బాలీవుడ్ ముద్దు అంటోంది.

Rashmika Mandanna : స్టార్ హీరో సినిమాను కాదన్న రష్మిక..? టాలీవుడ్ వద్దు.. బాలీవుడ్ ముద్దు అంటోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ కు గట్టిగానే హ్యాండ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు కొట్టేస్తున్న కన్నడ సోయగం. అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 04 2022, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఛలో సినిమాతో టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది కన్నడ సోయగం రష్మక మందన్న. ఆతరువాత విజయ్ దేవరకొండతో కలిసి చేసి గీతాగోవిందం సినిమా ఆమెకు స్టార్ డమ్ తీసుకువచ్చింది. అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రష్మిక చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆమె కెరీర్ నే మార్చేసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తూ వస్తున్న కన్నడ కస్తూరి ఇక్కడ బాగా స్టార్ డమ్ వచ్చే సరికి బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ లో ఎలాగు స్టార్ డమ్ వచ్చింది. ఇంకా బాలీవుడ్ కు వెళ్తే.. అక్కడ ఇండస్ట్రీ పెద్దది. అవకాశాలు ఎక్కువగ.. స్టార్ డమ్ కూడా డబుల్ అవుతుంది అన్న ఆశలో ఉంది రష్మిక ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు చేసేసింది కూడా. సిద్ధార్ద్ మల్హోత్ర హీరోగా మిషన్ మజ్ను సినిమాలో నటించిన రష్మిక గుడ్ బై అనే మరో హిందీ సినిమాలో కూడా సందడి చేసింది. అంతే కాదు బాలీవుడ్ యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్. మిల్క్ ప్రాడక్ట్స్ యాడ్ లో కనిపించింది. అంతే కాదు స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తుంది బాలీవుడ్ లో.

36

ఇక ఈమధ్య టాలీవుడ్ నుంచి రిలీజ్అయ్యి పాన్ ఇండియారేంజ్ లో సూపర్ సక్సెస్ అయిన పుష్ప మూవీ ఆమెకు బాగా కలిసోచ్చింది. అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక ఇద్దరూ పాన్ ఇండియాకు వెళ్లడం ఇదే మొదటి సారి. టోటల్ గా 300 కోట్లుకు పైగా కలెక్ట్ చేసిన పుష్ప.. హిందీలో కూడా భారీగానే కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ ఇమేజ్ రష్మికకు బాగా కలిసొచ్చింది. హిందీలో ఆమె గట్టిగా పాతుకుపోవడానికి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది.

46

ఇక ఎలాగు బాలీవుడ్ కు చేరుతున్న రష్మిక ఇక అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటుందట. అందుకే ముందే అక్కడ ఇల్లు కొని  గృహ ప్రవేశం కూడా చేసేసింది.అంతేనా.. అప్పుడే టాలీవుడ్ సినిమాలను రిజక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసిందట కన్నడ బ్యూటీ. ఇక్కడ ఓ స్టార్ హీరోతో.. భారీ బడ్జెట్ మూవీకి  రష్మిక డేట్స్ అడిగితే నో చెప్పిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నారు. ఆ హీరో మహేష్ బాబు అయ్యి ఉంటాడని.. చెవులు కొరుక్కుంటున్నారు కూడా.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. ఆమె బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం మాత్రం ఖాయం అయిన తెలుస్తోంది.

56

స్టార్ డమ్ రావాలన్నా.. పాన్ ఇండియా స్టార్ కావాలన్నా.. టాలీవుడ్ ను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ స్టార్ గా మారిన తరువాత హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. రష్మికతో పాటు పూజా హెగ్డే కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆమెకు అక్కడ వర్కైట్ అవ్వక.. టాలీవుడ్ కు వచ్చింది. టాలీవుడ్ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కోసం టాలీవుడ్ ఆఫర్లను కూడా వదులుకుంటుందట పూజా. ఇటు రష్మిక కూడా ఇదే పని చేస్తుంది. బాలీవుడ్ కోసం టాలీవుడ్ ను పక్కన పెట్టేస్తుందట.

66
Rashmika Mandanna stunning photos

Rashmika Mandanna stunning photos

ప్రస్తుతం పుష్ప హిట్ జోష్ లో ఉంది రష్మిక. ఆమె ఎప్పుడో కమిట్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. బాలీవుడ్ లో సినిమాల కోసం ఎదురు చూస్తోంది. కొన్ని కథలు వింటోంది.అక్కడే ఉండి ఇంకా ప్రయత్నాలు చేయాలి అనుకుంటుంది. అందకే త్వరలో అక్కడికే మకాం మార్చాలని ప్లాన్ చేస్తుందట. బాలీవుడ్ ఆఫర్లు వస్తే చేసుకోవడంలో తప్పలేదు. కాని తమను స్టార్స్ గా తీర్చి దిద్దిన టాలీవుడ్ ను మర్చిపోవడం మంచిది కాదంటున్నారు నెటిజన్లు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved