- Home
- Entertainment
- అది మ్యాటర్, అత్యాశకు పోతే అంతే.. రష్మిక దేనికోసం అయితే నితిన్ మూవీ వదులుకుందో ఇప్పుడు అది కూడా పాయె ?
అది మ్యాటర్, అత్యాశకు పోతే అంతే.. రష్మిక దేనికోసం అయితే నితిన్ మూవీ వదులుకుందో ఇప్పుడు అది కూడా పాయె ?
కొన్ని నెలల క్రితం నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్. దీనితో ఈ మూవీపై అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ వచ్చింది.

కొన్ని నెలల క్రితం నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్. దీనితో ఈ మూవీపై అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ వచ్చింది. వెంకీ కుడుములు భీష్మ చిత్రానికి భిన్నంగా డిఫెరెంట్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్.
అయితే రష్మిక ఊహించని విధంగా నితిన్, వెంకీ కుడుముల చిత్రం నుంచి తప్పుకుంది. రష్మిక నిర్ణయం వెనుక చాలా ప్రచారం జరిగింది. రష్మికకి తన మాజీ మేనేజర్ కిరణ్ తో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. రష్మిక ఈ మూవీ నుంచి తప్పుకోవడం వెనుక అతడి ప్రమేయం ఉందని రూమర్స్ వచ్చాయి. మరో ప్రచారం ఏంటంటే రష్మిక బాలీవుడ్ చిత్రాలకి ప్రధాన ఇవ్వడం వల్ల నితిన్ చిత్రం కోల్పోయింది అని అన్నారు.
అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రష్మికకి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. ఆగష్టు 1 నుంచి ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనితో నితిన్ చిత్రానికి డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ మూవీని రష్మిక పక్కన పెట్టేసింది. ప్రతి హీరోయిన్ బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నిస్తుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది హీరోయిన్లలో సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ.
రష్మిక కి కూడా బాలీవుడ్ ఏమాత్రం కలసి రావడం లేదు. ఇప్పటి వరకు రష్మికకి బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ షాహిద్ కపూర్ మూవీ కోసం నితిన్ మూవీ ని పక్కన పెట్టేసింది. అయితే ఆ మూవీ కూడా ఇప్పుడు అటకెక్కింది. బడ్జెట్ సమస్యల వల్ల షాహిద్ కపూర్ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ నితిన్, వెంకీ కుడుముల చిత్రంలోకి క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చేసింది.
దీనితో అత్యాశకు పోయిన రష్మికకి భంగపాటు తప్పలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ఒకే ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2 మాత్రమే.పుష్ప 2 చిత్రం రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాదే.
నేషనల్ క్రష్ గా సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న రష్మికకి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గుతున్నాయి. శ్రీలీల హవా, స్వయం తప్పిదాల వల్ల రష్మిక కొన్ని ఆఫర్స్ కోల్పోతోంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు.