రష్మిక బాత్‌రూమ్‌లో ఫోటో షూట్.. పింక్ ట్రెండీ వేర్ లో హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న నేషనల్ క్రష్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తనదైన స్టయిల్‌లో దూసుకుపోతుంది. ఓ వైపు గ్లామర్ షో చేస్తూనే క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
రష్మిక మందన్నాలో చాలా మార్పు కనిపిస్తుంది. జనరల్‌గా హీరోయిన్లు ప్రారంభంలో ఉన్నట్టుగా తర్వాత ఉండరు, క్రమంగా మారిపోతుంటారు. ట్రెండ్‌ని, అవకాశాలను బట్టి వారిలో మార్పు వస్తుంది. రావాలి కూడా. అది పాజిటివ్ వైపు, అవకాశాల వైపు అయితే బాగుంటుంది. వారి కెరీర్ ముందుకు సాగుతుంది. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటారు. రష్మికలో వచ్చిన మార్పు కూడా అలాంటిదే. ఆమె ప్రారంభంలో పద్ధతిగా కనిపించింది. కానీ ఆ తర్వాత డోస్ పెంచింది. బాలీవుడ్‌కి వెళ్లాక పూర్తి గా మారిపోయింది.
వెంట వెంటనే హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. `ఛలో`, `గీతగోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలు ఈ బ్యూటీకి పెద్ద బూస్ట్ ఇచ్చాయి. దీంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత `దేవదాసు`, `డియర్ కామ్రేడ్` వంటి డిజప్పాయింట్లు ఎదురైనా, ఆ ప్రభావం తనపై లేకుండా జాగ్రత్త పడింది. బాలీవుడ్ ఆఫర్లు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.
మరోవైపు `పుష్ప`లో భాగం కావడంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా నటించి ఆకట్టుకుంది. అలరించింది. శ్రీవల్లిగా ఇంటర్నేషనల్ వైడ్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇతర దేశాల అమ్మాయిలు సైతం శ్రీవల్లి డాన్సు చేస్తూ రీల్స్ చేయడం విశేషం. అంతటి ఇమేజ్ రావడంతో గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది రష్మిక. నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు హాట్ డోస్ పెంచింది. గ్లామర్ ఫోటో షూట్లతో షాకిస్తూ వచ్చింది.
శృతి మించిన గ్లామర్ డోస్‌తో ఆశ్చర్యపరుస్తున్న రష్మిక లేటెస్ట్ గా నయా అందాలతో అదరగొట్టింది. రెడ్ టాప్, పింక్ స్కర్ట్ ధరించింది. టైట్ డ్రెస్‌లో అందాల విందు చేసింది. కసి చూపులతో మత్తెక్కిస్తుంది. కిల్లర్ పోజులతో నెట్టింట రచ్చ చేస్తుందీ నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు ఇందులో బాత్ రూమ్‌లో ఫోటో షూట్ చేయడం గమనార్హం. ఇదే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్‌గా, కామెంట్లకి కారణమవుతుంది.
ఫోటో షూట్‌కి బాత్‌రూమ్‌ని ఎంచుకోవడంతో అంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇదేం అరాచకం అంటున్నారు. అయితే బాత్‌రూమ్‌లో హీరోయిన్లు ఫోటో షూట్ చేయడం కొత్తేమీ కాదు, చాలా హీరోయిన్లు చేస్తుంటారు. బాత్ టబ్‌లో పడుకుని, స్నానాలు చేస్తూ ఫోటో షూట్లు చేసిన సందర్భాలు కోకోల్లలు, వారితో పోల్చితే రష్మిక చేసింది పెద్ద వింతేమీ కాదు. కానీ సర్‌ప్రైజింగ్‌కి గురి చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ సైతం ఫన్నీగా ఉంది.
ఇందులో రష్మిక చెబుతూ, మా క్రియేటివిటీ వాష్ రూమ్‌ని కలిసినప్పుడు` అని పేర్కొంది. తమ క్రియేటివిటీ వాష్ రూమ్‌లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందో రష్మిక ఈ పోస్ట్ ద్వారా చెప్పింది. దీనిపై నెటిజన్లు పలు ఫన్నీ పోస్ట్ లు పెడుతున్నారు. బాత్‌రూమ్ సెలబ్రిటీ అంటున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక కెరీర్‌పరంగా చూస్తే రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.
ఆమె బన్నీతో `పుష్ప` పార్ట్ 2 `పుష్ప 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మొదటి భాగాన్ని మించి లార్జ్ స్కేల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కి రానుంది. దీంతోపాటు హిందీలో `యానిమల్` అనే పాన్ ఇండియా మూవీ చేస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. అలాగే నితిన్‌తో వెంకీ కుడుముల మూవీ చేస్తుంది. అయితే ఇందులో నుంచి తాను తప్పుకున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.