MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌

OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌

తెలుగు కామెడీ, ఫ్యామిలీ వెబ్ సిరీస్‌ `సేవ్‌ ది టైగర్స్ 3` ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 23 2026, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నవ్వులు పూయిస్తోన్న సేవ్‌ ది టైగర్స్ 3
Image Credit : Asianet News

నవ్వులు పూయిస్తోన్న సేవ్‌ ది టైగర్స్ 3

`సేవ్‌ ది టైగర్స్` అనే వెబ్‌ సిరీస్‌ తెలుగులో బాగా పాపులర్‌ అయ్యింది. కామెడీకి కామెడీ, ఫ్యామిలీ అంశాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ, అలకలు, గొడవల ప్రధానంగా ఈ సిరీస్‌ సాగుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. భార్యల విషయంలో భర్తలు పడే బాధలను ఇందులో ఫన్నీగా,సెటైరికల్‌గా చూపించారు. ఆద్యంతం కామెడీ ప్రధానంగా సాగుతూ ఆకట్టుకుంటోది. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి హిట్‌ అయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్‌ ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కొత్తగా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌  ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతోంది. ఈ సిరీస్‌పై టీమ్‌ రియాక్ట్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతోన్న సేవ్‌ ది టైగర్స్ 3
Image Credit : Asianet News

ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతోన్న సేవ్‌ ది టైగర్స్ 3

జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ‘సేవ్ ది టైగ‌ర్స్ 3’ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్‌ భారీ స్థాయిలో వ్యూస్‌ని సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా ఒక‌ సిరీస్‌కు వ‌రుస సీజ‌న్స్ వ‌స్తున్న‌ప్పుడు ఒత్తిడితో స‌క్సెస్ త‌గ్గిపోతుంది. కానీ సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్ మాత్రం ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని ఇప్పుడు మరింత ఆదరణతో దూసుకుపోతుంది.

Related Articles

Related image1
India Top 10 Heroes: అల్లు అర్జున్‌కి దెబ్బ మీద దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ స్థానాలు ఇవే
Related image2
Transfer Trimurthulu Collections: వడ్డే నవీన్‌ సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదు.. ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్‌ కలెక్షన్లు
34
సేవ్‌ ది టైగర్స్ 3 సక్సెస్‌ వెనుక కారణం
Image Credit : Asianet News

సేవ్‌ ది టైగర్స్ 3 సక్సెస్‌ వెనుక కారణం

వరుస విజయాలతో షోరన్నర్ మహి వి రాఘవ్ తన ప్రతిభను మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు సీజన్లు, అలాగే ‘సైతాన్‌’ వంటి థ్రిల్ల‌ర్ ప్రాజెక్టులతో ఇప్పటికే హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన వెబ్ స్పేస్‌లో హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు. ఓ క‌థ‌ను కమర్షియల్‌గా, ఆక‌ట్టుకునేలా రూపొందించ‌టం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా స్ట్రాంగ్‌గా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాల్యూని ఏమాత్రం త‌గ్గించ‌కుండా రూపొందించడంలో ఆయన దిట్ట.

44
ఓటీటీ కల్చర్‌ ఇంకా పెరగాలి
Image Credit : Asianet News

ఓటీటీ కల్చర్‌ ఇంకా పెరగాలి

`ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మ‌న ప్రేక్ష‌కులు ఇంకా అల‌వాటు ప‌డలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు` అని ఆయన ఇటీవల ఓ సంద‌ర్భంలో చెప్పారు. నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి ఎప్పుడూ సిద్ధ‌మే. మళ్లీ మళ్లీ చూసే పాత ఫార్ములాల‌తోనే కంటెంట్‌ను చేయ‌కుండా ప్రత్యేకమైన రీజినల్ కంటెంట్‌ను డెవలప్ చేయడంపైనే ఈ సంస్థ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఇక `సేవ్‌ ది టైగర్స్ 3` ఇండియా వైడ్‌గా దుమ్మురేపుతోంది. టాప్ 10 దూసుకుపోతుండటం విశేషం. ఇందులో ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమటం, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Related Stories
Recommended image1
India Top 10 Heroes: అల్లు అర్జున్‌కి దెబ్బ మీద దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ స్థానాలు ఇవే
Recommended image2
Transfer Trimurthulu Collections: వడ్డే నవీన్‌ సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదు.. ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved