పట్టు చీరలో హొయలు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చితక్కొట్టేసిన యాంకర్ రష్మీ.. జబర్దస్త్ ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది.
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది.
రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు.
బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు.
సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.
లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.
తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. ట్రెడిషనల్ లుక్ లో రష్మీ అందం రెట్టింపు అయ్యిందా అన్నట్లుగా ఉంటుంది.
కళ్ళు చెదిరే పట్టు చీరలో చిరునవ్వులు చిందిస్తూ, ఇస్తున్న సిట్టింగ్ ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. అంతేకాదు. నిలువెత్తు సోయగాలని ఫ్రంట్ ఆంట్ బ్యాక్ చూపిస్తూ కుర్రకారుపై అందాల వల విసురుతోంది.
రష్మీ సోయగాలకు యువతలో తాపం పెరిగిపోతోంది అనే చెప్పాలి. జాబిలి వెన్నెల వెదజల్లినట్లు రష్మీ గ్లామర్ ఒలకబోస్తోంది. పైట ఎగరేస్తూ రష్మీ ఇస్తున్న ఫోజులు యువతని విరహంతో ముంచుతున్నాయి.