షాక్: సుధీర్ చూస్తుండగానే శేఖర్ మాస్టర్ వడిలో కూర్చొని రష్మీ రొమాన్స్... సుధీర్ పరిస్థితేంటి?
ఢీ వేదిక సాక్షిగా రష్మీ గౌతమ్, శేకర్ మాస్టర్ రొమాన్స్ సంచలనం రేపింది. ఓ రొమాంటికి సాంగ్ కి వీరిద్దరూ క్రేజీ స్టెప్స్ తో రెచ్చిపోగా అక్కడే ఉన్న సుధీర్ షాక్ లోకి వెళ్లారు.
బుల్లితెర ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షోస్ లో ఒకటైన ఢీ వేదికపై లవ్ అండ్ రొమాన్స్ చాలా కామన్. ఢీ యాంకర్స్ తోటి యాంకర్స్ తో పాటు జడ్జెస్ తో కూడా రొమాన్స్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
ఈ జాబితాలో సీనియర్ జంటగా ఉన్నారు సుధీర్, రష్మీ. ఇక గత సీజన్ లో హైపర్ ఆది, యాంకర్ వర్షిణితో రొమాన్స్ చేయడం జరిగింది. మరో యాంకర్ ప్రదీప్ ఏకంగా జడ్జ్ పూర్ణతో ఆడిపాడారు.
తాజా ఎపిసోడ్ లో అనూహ్యంగా శేఖర్ మాస్టర్, యాంకర్ రష్మీ, దీపికా పిల్లితో రొమాంటిక్ స్టెప్స్ వేసి అల్లాడించారు. ముఖ్యంగా రష్మీ శేఖర్ మాస్టర్ ఒడిలో కూర్చుని సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు.
ర్జున్ రెడ్డి మూవీలోని మధురమే ఈ క్షణమే సాంగ్ ని ఓ కంటెస్టెంట్ స్టేజ్ పై పెర్ఫార్మ్ చేశారు.
అద్భుతంగా చేసిందని ఆమెను కొనియాడిన జడ్జెస్, ఆ తరువాత ఆ సాంగ్ సుధీర్ తో పెర్ఫార్మ్ చేయించారు.
ఆ తరువాత జడ్జ్ శేఖర్ మాస్టర్ యాంకర్స్ దీపికా పిల్లి, రష్మీతో పెర్ఫార్మ్ చేశారు. ఐతే ఈ సాంగ్ లో రష్మీ మరింతగా రెచ్చిపోయింది.
శేఖర్ మాస్టర్ వడిలో కూర్చొని రొమాన్స్ చేశారు. ఇదంతా చూస్తున్న సుధీర్ నోట మాట రాలేదు.
ఇక పాట వేస్తూ ఉంటే ఆయన వచ్చే పండగ వరకు రొమాన్స్ చేస్తూ ఉంటాడని, హైపర్ ఆది సెటైర్ వేయడంతో వాళ్ళు రొమాంటిక్ ఫీల్ నుండి బయటికి వచ్చారు.
తాజా ఢీ ప్రోమోలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోగా... ఇకపై సుధీర్ కి రష్మి హ్యాండ్ ఇస్తుందేమో అని చెప్పుకుంటున్నారు.