MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్లాప్స్ లో హ్యాట్రిక్స్.... ప్రమాదం అంచున ఆ ముగ్గురు హీరోయిన్స్! 

ప్లాప్స్ లో హ్యాట్రిక్స్.... ప్రమాదం అంచున ఆ ముగ్గురు హీరోయిన్స్! 

ఈ టాలీవుడ్ హీరోయిన్స్ హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశారు. ఆ దెబ్బతో వాళ్ళ కెరీర్ ప్రమాదపు అంచుల్లోకి చేరింది. ఆఫర్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఒకింత జంకుతున్నారు. రాశి ఖన్నా, కృతి శెట్టి, కేతిక శర్మ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 21 2022, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tollywood Heroines

Tollywood Heroines

కెరీర్ ని డిసైడ్ చేసేది సక్సెస్ మాత్రమే. టాలెంట్ ఉన్నా లేకుండా అదృష్టం చాలా ముఖ్యం. ఆ లక్ ఉన్నోళ్లు వరుస హిట్స్ తో ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్లాప్స్ పడ్డ హీరోయిన్స్ అన్నీ ఉండి కూడా అట్టడుగుకు పడిడిపోతారు. అలాగే సక్సెస్లు చూసిన హీరోయిన్స్ కి వరుస ప్లాప్స్ పడితే ప్రమాదమే. ప్రస్తుతంఆ పరిస్థితి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఎదుర్కొంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Tollywood Heroines

Tollywood Heroines

రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతుంది. ఊహలు గుసగుసలాడే, జిల్, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.

36

అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేసి వచ్చిన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమైనా రాశి కోలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేశారు. గ్యాప్ ఇచ్చి పక్కా కమర్షియల్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక లేటెస్ట్ రిలీజ్ థాంక్యూ ఆల్ టైం డిజాస్టర్. ఇలా తెలుగులో హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసిన రాశి కెరీర్ డేంజర్ లో పడింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్స్ లేవు.

46

సమంత, రష్మిక మందాన తర్వాత వస్తూనే సంచలనం రేపిన హీరోయిన్ కృతి శెట్టి. అరంగేట్రంతో హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసిన కృతి శెట్టి లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ఆమె డెబ్యూ మూవీ ఉప్పెన డబుల్ బ్లాక్ బస్టర్ కాగా.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

56

అయితే ఆమె గత మూడు చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్లాప్ ఖాతాలో చేరాయి. దీంతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ గల్లంతైంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యకు జంటగా ఓ మూవీ చేస్తున్నారు. అలాగే సూర్యకు జంటగా మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నాయి.

66
Tollywood Heroines

Tollywood Heroines

ఇక కేతిక శర్మ టైం అసలేం బాగోలేదు. చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. రొమాంటిక్ మూవీతో వెండితెరకు పరిచయమైన కేతిక నాగ శౌర్యకు జంటగా లక్ష్య చేశారు. రొమాంటిక్, లక్ష్య ప్లాప్ అయ్యాయి. దీంతో వైష్ణవ్ తేజ్ తో రొమాంటిక్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా చేశారు. ఇది మరో డిజాస్టర్ అయ్యింది. ఇకపై ఆమెకు తెలుగులో కష్టమే.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tarun To Raj Tarun: తరుణ్ నుంచి రాజ్ తరుణ్ వరకు, టాలీవుడ్ ని ఎలాల్సిన హీరోలు.. ఒక్క ఫ్లాప్ తో అంతా పతనం
Recommended image2
Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?
Recommended image3
IBomma: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక దబిడి దిబిడే.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved