- Home
- Entertainment
- Dhurandhar OTT: ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర.. పుష్ప 2 రికార్డుని బద్దలు కొడుతూ వందల కోట్లతో ఓటీటీ డీల్
Dhurandhar OTT: ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర.. పుష్ప 2 రికార్డుని బద్దలు కొడుతూ వందల కోట్లతో ఓటీటీ డీల్
Dhurandhar: ‘కాంతార 1’ను అధిగమించి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. 21వ రోజుకు భారతదేశంలో ధురంధర్ 668.80 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1006.7 కోట్లు వసూలు చేసింది.

ధురంధర్
1000 కోట్ల క్లబ్‌లో చేరి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రణవీర్ సింగ్ ‘ధురంధర్’ నిలిచింది. విడుదలైన 21 రోజుల్లోనే ఆదిత్య ధర్ దర్శకత్వంలోని ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటింది.
భారత్‌లో 668.80 కోట్లు
‘కాంతార 1’ను అధిగమించి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. 21వ రోజుకు భారత్‌లో 668.80 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1006.7 కోట్లు వసూలు చేసింది.
‘ఎ’ రేటెడ్ సినిమా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన ‘ఎ’ రేటెడ్ భారతీయ సినిమాగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ మొదటి స్థానంలో ఉంది.
‘ధురంధర్’ సినిమా ఓటీటీ హక్కులు
‘ధురంధర్’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 285 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆనందంలోనే చిత్ర బృందం సినిమా తదుపరి భాగాన్ని కూడా ప్రకటించింది.దీనితో పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టినట్లు అయింది. గతంలో పుష్ప 2 ఓటీటీ హక్కులు 275 కోట్లకు అమ్ముడయ్యాయి.
ధురంధర్ 2
యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా విడుదలయ్యే 2026 మార్చి 19నే 'ధురంధర్ 2' కూడా హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

