MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇక బిడ్డని కనలేను..ఈ నరకం అనుభవించిన వారికే తెలుస్తుంది, హీరోయిన్ ఆవేదన

ఇక బిడ్డని కనలేను..ఈ నరకం అనుభవించిన వారికే తెలుస్తుంది, హీరోయిన్ ఆవేదన

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. రాణి ముఖర్జీతో గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. 1998 నుంచి ఇప్పటి వరకు రాణి ముఖర్జీ ఎన్నో చిత్రాల్లో నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 22 2024, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రాణి ముఖర్జీ ఒకరు. రాణి ముఖర్జీతో గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. 1998 నుంచి ఇప్పటి వరకు రాణి ముఖర్జీ ఎన్నో చిత్రాల్లో నటించింది. రాణి ముఖర్జీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎదిగిందంటే అందులో ఆదిత్య చోప్రా ప్రమేయం కూడా ఉంది. రాణి ముఖర్జీని పలు చిత్రాలకు ఆదిత్య చోప్రా రికమండ్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

2014లో ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వివాహం చేసుకున్నారు. ఆదిత్య చోప్రా బాలీవుడ్ లో బడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేతే ఆదిత్య చోప్రా. ఈ జంటకి 2014లో ఒక కుమార్తె జన్మించింది. 

36
rani mukerji

rani mukerji

అయితే పిల్లల విషయంలో రాణి ముఖర్జీ నరకం అనుభవిస్తోందట. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రాణి ముఖర్జీ భావోద్వేగానికి గురవుతూ తెలిపింది. గర్భంలోనే శిశువుని కోల్పోతే ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుందో తాను అనుభవించానని తెలిపింది. మరోసారి ఆ బాధని గుర్తు చేసుకుంది. 

46

రాణి ముఖర్జీ మాట్లాడుతూ నా కూతురికి ఏడాది వయసు రాగానే మరో బిడ్డ కోసం ప్రయత్నించాం. ఐదేళ్ల తర్వాత 2020లో మరోసారి గర్భవతి అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీనితో కడుపులోనే బిడ్డని కోల్పోయా. ఆ నరకం వర్ణనాతీతం. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు. నా వయసు ఇప్పుడు 46 ఏళ్ళు. 

56

ఈ వయసులో ఇక బిడ్డని కనలేను. నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లినో ఇవ్వలేకపోతున్నాననే బాధ మాకు జీవితాంతం ఉంటుంది. నా కూతురు అధీరా బంగారు తల్లి. తన వల్లే నేను సంతోషంగా ఉండగలుగుతున్నా. ఇప్పుడు నేను బిడ్డని కనే వయసు దాటేశాను. ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి అని రాణి ముఖర్జీ భావోద్వేగానికి గురైంది. 

66

రాణి ముఖర్జీ తన కెరీర్ లో హలో బ్రదర్, సాథియా, చల్తే చల్తే, ప్యార్ దివానా హోతాహై లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image2
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image3
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved