నా వక్షోజాల సైజు.. సంభోగంలో ఫ్రీక్వెన్సీ ప్రశ్నించాడు! స్టార్ డైరక్టర్ పై ఆరోపణలు
స్టార్ డైరక్టర్ తనను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించటం బాధించిందంటున్నారు ఖత్రోంకి కిలాడీ ఫేమ్, భోజ్‌పురి నటి రాణి చటర్జీ. ఆమెకి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులున్నారు. ఈ నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది.

మీటూ ఉద్యమం మరోసారి మొదలయ్యేటట్లు కనపడుతోంది. సర్దుమణిగిందనుకున్న ఈ ఉద్యమం మరోసారి వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ప్రముఖ భోజ్ పురి నటి రాణి ఛటర్జీ ప్రముఖ దర్శకనిర్మాతపై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆ నిర్మాత నా సైజుల గురించి అడిగాడు. సంభోగంలో ఫ్రీక్వెన్సీ గురించి అడిగాడు.. పదే పదే నన్ను తాకాలని చూశాడు!! అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వివరాల్లోకి వెళితే...
Rani Chatterjee
బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత సాజిద్ ఖాన్ MeToo నిందితుడు. చాలా కాలంగా ఇలాంటి వార్తల్లో ఉన్నారు. తాజాగా 'బిగ్ బాస్ 16' హౌస్ లోకి ప్రవేశించినప్పటి నుండి హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. అతడి బాధితురాళ్లలో నటీమణులు ఒక్కొక్కరుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేసిన వాళ్లలో షెర్లిన్ చోప్రా సహా తనూశ్రీ దత్తా సాజిద్ వంటి నటీమణులు ఉన్నారు. వారంతా అతనిపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. పలువురు ఆర్టిస్ట్ లు ఆయనపై ఆరోపణలు చేస్తూండటంతో ఇదో పెద్ద ఇష్యూగా మారుతోంది.
తాజాగా భోజ్ ఫురి సంచలనం రాణి ఛటర్జీ ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ పై కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. 'హిమ్మత్ వాలా' చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకుంటూ సాజిద్ తనను 'ఢోకా ఢోకా' అనే ఐటమ్ నంబర్ కోసం పిలిచారని తన ఇంటికి ఒంటరిగా రావాలని కోరాడని రాణి చెప్పింది.
బాలీవుడ్‌లో అతను చాలా పెద్ద దర్శకుడు. కాబట్టి.. నేను అతను చెప్పినట్లే చేయాల్సి వచ్చింది. ఒంటరిగా జుహూలోని అతని ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో అతను ఒంటరిగానే ఉన్నాడు. ‘ఢోకా ఢోకా’ ఐటెం సాంగ్ కోసం నన్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు అతను చెప్పాడు. ఐటం సాంగ్ కావడంతో అందులో నేను పొట్టి లెహంగా వేసుకోవాలి. కాబట్టి ఓ సారి నా కాళ్లు చూపించమని అడిగాడు. ఆ సమయంలో నేను పొడవాటి స్కర్ట్ ధరించాను. దాంతో.. అదే సెలక్షన్ చేసే విధానం కావొచ్చని నా స్కర్ట్‌ని మోకాళ్ల వరకు లేపి చూపించాను అని చెప్పుకొచ్చారామె.
అలా ఒంటిరిగా వచ్చిన తనను తన రొమ్ముల పరిమాణం గురించి అడిగాడు.. కాళ్ళ సౌందర్యాన్ని చూపించమని అడిగాడని వెల్లడించింది. అప్పుడు తను షాక్ కు గురి అయ్యానని, ఆయన నుంచి అలాంటి మాటలు ఊహించలేదంది. అసలు ఎవరూ ఎప్పుడూ ఇలా తనతో మాట్లాడకపోవటంతో కాసేపు మాటలు రాలేదంది.
ఆ తర్వాత తను సమాధానం చెప్పకపోయేసరికి... తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే సంభోగంలో ఫ్రీక్వెన్సీ గురించి సాజిద్ అడిగినప్పుడు రాణి మరింత ఆశ్చర్యపోయిందిట. ఇలాంటివి జరుగుతాయని తను వినటమే కానీ తన జీవితంలోకి అనుభవంలోకి వచ్చేసరికి ఎలా డీల్ చేయాలో తెలియలేదంది.
అలాంటి చేష్టలు ఎవరికైనా దారుణంగా ఉంటాయని, తనకు చాలా అసహ్యంగా అనిపించందని చెప్పింది. ఆ తర్వాత సాజిద్ తనను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడని కూడా ఆమె ఆరోపించింది.
మరో ప్రక్క బాలీవుడ్ దర్శకుడు, బిగ్‌బాస్ 16 కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ (Sajid Khan)పై విమర్శలు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మీటూలో భాగంగా 2018లో ఎంతోమంది నటీమణులు ఈ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. దాంతో దాదాపు నాలుగేళ్ల పాటు సరైన అవకాశాలు లేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ దర్శకుడు తాజాగా బిగ్‌బాస్ 16కి కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా మందన కరిమి, ఆహానా కుమ్రా, షెర్లిన్ చోప్రా, ఉర్ఫీ జావేద్ వంటి పలువురు బాలీవుడ్ నటీమణులు సాజిద్ విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా.. అలాంటి ఉమనైజర్‌కి అవకాశం ఇస్తారా అంటూ బిగ్‌బాస్ యాజమాన్యంపై కూడా విమర్శలు చేశారు.
అనంతరం రాణి ఇంకా మాట్లాడుతూ.. ‘అప్పుడే ఈ విషయం గురించి బహిర్గతం చేస్తే సినీ పరిశ్రమలో నాపై నిషేధం విధిస్తారేమోనని, అవకాశాలు ఇవ్వరేమోనని సైలెంట్‌గా ఉండిపోయాను. కానీ #MeToo సమయంలో చాలా మంది మహిళలు మాట్లాడటం చూసి నాకు ధైర్యం వచ్చింది. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా’ అని తెలిపింది.
రాణి ఛటర్జీ. బోజ్‌పురిలో ఈమె మంచి నటి. ఈమెకు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వేధింపులు తారాస్థాయిలో వస్తున్నాయి. దీనితో ఆమె సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన వల్ల కావడం లేదని.. తనతో అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోతుంది రాణి.
గతంలో ఇదే విషయంపై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ధనుంజయ్ సింగ్ అనే ఓ వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. అంతేకాదు తనను ముసలిదాన అంటూ సంభోదిస్తూ చేస్తున్న కమెంట్స్ చూస్తుంటే భయమేస్తుందని చెప్పింది రాణి. ఆ సమయంలో తనకు ఆత్మహత్య తప్ప మరే మార్గం లేదన్నట్లుగా అనిపిస్తుందని చెప్తుంది రాణి ఛటర్జీ.
మొదట్లో వాటిని తాను పట్టించుకోకూడదని అనుకున్నా రానురాను మరీ నీచంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది రాణి. అకౌంట్ బ్లాక్ చేసినా.. ఎంత దూరంగా ఉన్నా కూడా అతడి నుంచి మాత్రం ఇప్పటికీ అలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపింది రాణి.
ఈ విషయాలన్నీ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుండి తనను రక్షించకుంటే కచ్చితంగా ఏదో ఓ క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది రాణి ఛటర్జీ. ఈమె ఫిర్యాదుపై వెంటనే పోలీసులు కూడా స్పందించారు.
ఖత్రోంకి కిలాడీ ఫేమ్, భోజ్‌పురి నటి రాణి చటర్జీకి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులున్నారు. ఈ నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది. రాణి ఛటర్జీ భోజ్‌పురి సినిమాకి సుపరిచితమైన పేరు.
రాణి తన అందం మరియు ప్రతిభతో మిస్ కోల్‌కతాగా నిలిచింది. రాణి 2003లో మనోజ్ తివారీ సూపర్‌హిట్ చిత్రం ‘ససురా బడా పైసావాలా’తో తెరంగేట్రం చేసింది. ఇటీవల సల్మాన్ ఖాన్ ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 16’ కోసం రాణి ఛటర్జీని సంప్రదించారు. కానీ నటి షోలో భాగం కావడానికి నిరాకరించిందని వార్తలు వచ్చాయి.
రాణి ఛటర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ గా ఉన్న చాలా ఫోటోలను షేర్ చేశారు. ఆమె ప్రతి లుక్,స్టైల్‌లో తన అభిమానులకు పిచ్చేక్కించేలా చేస్తుంది. రాణి వేసే డ్రస్ లలో దేవదూతలా కనిపిస్తుందని ఫ్యాన్స్ మురిసిపోతూంటారు. ఆమె అభిమానులకు ఆమెను పొగిడే తీరిక లేకుండా పోయిందంటున్నారు రాణి ఫ్యాన్స్, నెటిజన్లు.
ఏదైమైనా దశాబ్ధాల క్రితం జరిగిన ఒక్కో ఘటనను గుర్తు చేసుకుంటూ పలువురు నటీ మణులు ఇప్పుడిలా బయటపడడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాజిద్ ఖాన్ పై ఆరోపిస్తున్న వారి జాబితా అంతకంతకు పెరుగుతోంది. బిగ్ బాస్ 16లో ప్రవేశం అతడికి ఇబ్బందికర సన్నివేశాన్ని క్రియేట్ చేయడమే గాక ఉచిత పబ్లిసిటీని విస్త్రతంగా తెచ్చి పెడుతోంది.
షెర్లిన్.. కనిష్క సంచలన ఆరోపణలు దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ చుట్టూ రకరకాల వివాదాలు సంచలనంగా మారాయి. మీటూలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వేధింపుల ఫిలింమేకర్ ని బిగ్ బాస్ 16 షోలోకి ఆహ్వానించడం బాధ్యతారాహిత్యం అంటూ తనూశ్రీ దత్తా ఇంతకుముందు ఫైరైంది. అంతకంటే ముందే షెర్లిన్ చోప్రా సైతం తనకు చూపించకూడనిది చూపించి రేటింగ్ అడిగాడంటూ ఆరోపించి సంచలనం సృష్టించింది. సాజిద్ ఎంట్రీ మాటేమో కానీ అంతకుముందే అతడి బాధితులంతా ఆరోపించడం ప్రారంభించారు.
షెర్లిన్ తర్వాత టీవీ నటి కనిష్క సోని ఆరోపణలు సంచలనంగా మారాయి. దో దిల్ ఏక్ జాన్- పవిత్ర రిష్తా- దియా ఔర్ బాతీ హమ్ - దేవోన్ కే దేవ్...మహాదేవ్ వంటి టీవీ షోలలో నటించిన నటి కనిష్క సోనీ దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ తనను అవకాశమిస్తాననే సాకుతో తన ఇంటికి ఆహ్వానించి అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ లో సాజిద్ కనిపించనున్నందున 14 సంవత్సరాల తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టాలనుకుంటున్నట్టు సోని వెల్లడించింది. ఆమె 2008లో ఖాన్ తో తన అనుభవాన్ని వివరించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది.