Animal Review: యానిమల్ ప్రీమియర్ టాక్: వైలెన్స్ కి మీనింగ్ చెప్పిన వంగ, రన్బీర్ కెరీర్ బెస్ట్, టాక్ ఇదే!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మూడో చిత్రం యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా నటించారు. రష్మిక మందాన హీరోయిన్. అనిల్ కపూర్ కీలక రోల్ చేశారు. యానిమల్ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదలవుతుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏమిటో చూద్దాం...
Animal Movie Review
దాదాపు ఒక స్ట్రైట్ తెలుగు స్టార్ హీరో మూవీకి ఉండేంత హైప్ యానిమల్ చిత్రం పై ఉంది. కేవలం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బ్రాండ్ వాల్యూ మీద సినిమాకు విపరీతమైన మార్కెట్ లభించింది. తెలుగు రాష్ట్రల్లో యానిమల్ బుకింగ్స్ రాంప్ అందిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఆకాశానికి చేరిన ఈ అంచనాలను రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి అందుకున్నారా...
Animal Movie Review
యానిమల్ రివేంజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తుంది. తండ్రి అనిల్ కపూర్ ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కొడుకుగా రన్బీర్ కపూర్ కనిపిస్తారు. అనిల్ కపూర్ చావుకు కారణమైన వాళ్ళను మట్టుబెడతానని రన్బీర్ శబధం చేస్తాడు. యానిమల్ గా రన్బీర్ మనస్తత్వం ఏమిటీ? ఫ్యామిలీ మెన్ గా, గ్యాంగ్ స్టర్ గా అతని ప్రయాణం ఎలా సాగిందనేది ప్రధాన కథ..
సినిమా ఆరంభంలోనే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చోటు చేసుకున్నాయట. రన్బీర్ కపూర్ ఎంట్రీ ఐ ఫీస్ట్ అంటున్నారు. ఆయన కనిపించే ప్రతి సన్నివేశం ఆటం బాంబులా సిల్వర్ స్క్రీన్ పై పేలింది అంటున్నారు. రన్బీర్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనడంలో సందేహం లేదని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అభిప్రాయం.
తండ్రి కొడుకులు, భార్య భర్తల మధ్య సంబంధాలు వంటి ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా చెప్పారట. లోతైన సన్నివేషాలు గుండెకు హత్తుకుంటాయని అంటున్నారు. భీభత్సమైన వైలెన్స్ మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించడం వంగ మార్క్ టేకింగ్ కి నిదర్శనం అంటున్నారు. రష్మిక, అనిల్ కపూర్ లతో రన్బీర్ కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు.
స్కూల్ పిల్లాడి నుండి కాలేజ్ బాయ్ ఆపై లవ్, మ్యారేజ్, గ్యాంగ్ స్టర్ ఇలా హీరో జీవితానికి సంబంధించి పలు దశలు ఈ సినిమాలు చూపించారు. మూడున్నర గంటల సినిమా ఎక్కడా బోర్ కొట్టదని సందీప్ రెడ్డి గట్టి విశ్వాసంతో చెప్పాడు. ఆడియన్స్ కూడా ప్రతి నిమిషం యానిమల్ చిత్రాన్ని ఆస్వాదిస్తారని ప్రీమియర్ టాక్.
యానిమల్ చిత్రానికి ఓన్లీ ఫర్ అడల్ట్ సర్టిఫికెట్ వచ్చింది. వైలెన్స్, రొమాన్స్, ఫోల్ లాంగ్వేజ్ మోతాదుకు మించి ఉన్నాయి. ఇక విలన్ బాబీ డియోల్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. వీరి ఇద్దరి మధ్య ఆధిపత్య పోటు సందీప్ రెడ్డి వంగా ఓ రేంజ్ లో రాశారని అంటున్నారు. ఫైనల్ ఫేస్ గొప్పగా ఉంటుందని ఆడియన్స్ అభిప్రాయం.
యానిమల్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎమ్ హైలెట్ అని సమాచారం. సందీప్ రెడ్డి టేకింగ్ కి బీజీఎమ్ ప్రాణం పోసింది. సన్నివేశాలను గొప్పగా ఎలివేట్ చేసిందని ప్రీమియర్ టాక్ ద్వారా తెలుస్తుంది. సినిమా అయిపోక క్రెడిట్స్ పడేటప్పుడు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. అది మిస్ కావద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Animal
మొత్తంగా యానిమల్ బెస్ట్ మూవీ. సందీప్ రెడ్డి టేకింగ్ కి రన్బీర్ కపూర్ అద్భుత పెర్ఫార్మన్స్ తోడై ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది అంటున్నారు. పూర్తి రివ్యూ వస్తే కానీ యానిమల్ ఏ రేంజ్ హిట్ అనేది తెలియదు..
Animal Review:యానిమల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఊపు ఊపేసిన రణబీర్ కపూర్, కాని..?