MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Ramayana Release: రామాయణం రిలీజ్ డేట్ లీక్? ఆ పెద్ద సినిమాతో రణ్‌బీర్ మూవీ క్లాష్!

Ramayana Release: రామాయణం రిలీజ్ డేట్ లీక్? ఆ పెద్ద సినిమాతో రణ్‌బీర్ మూవీ క్లాష్!

Ramayana Release: నితేశ్ తివారీ రామాయణం సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. మీడియా, ఇండస్ట్రీ వాళ్ల కోసం వేసిన స్పెషల్ ట్రైలర్ స్క్రీనింగ్ తర్వాత ఆన్‌లైన్‌లో కొత్త చర్చ మొదలైంది. మేకర్స్ ఇంకా ఏమీ చెప్పకపోయినా, ఈ సినిమాపై బజ్ మాత్రం తారాస్థాయికి చేరింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2026, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రామాయణం రిలీజ్ డేట్ పై ఊహాగానాలు..
Image Credit : Instagram

రామాయణం రిలీజ్ డేట్ పై ఊహాగానాలు..

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ లాంచ్ చేయడానికి ముందు, న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మీడియా, సినీ ప్రముఖుల కోసం 'రామాయణం' స్పెషల్ 3D స్క్రీనింగ్ వేశారు. ఈ ఈవెంట్ తర్వాత, ట్రేడ్ అనలిస్ట్ జీవీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. నటీనటుల ఎంపిక, విజువల్స్, సంగీతం, సినిమాలోని భారతీయతను ఆయన మెచ్చుకున్నారు. 

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ల నటన ఈ ఇతిహాసానికి సరిగ్గా సరిపోయిందని అన్నారు. అయితే, తన పోస్ట్ చివర్లో ఆయన 'నవంబర్ 8' అని చెప్పడంతో, అదే సినిమా రిలీజ్ డేట్ కావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఏ తేదీనీ ప్రకటించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ట్రైలర్ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులు..
Image Credit : Asianet News

ట్రైలర్ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులు..

ఈ కొత్త చర్చకు ముందు, 'రామాయణం' 2026 అక్టోబర్ చివరిలో థియేటర్లలోకి రావొచ్చని వార్తలు వచ్చాయి. సినెమాకాన్ (CinemaCon) ఈవెంట్‌లో యశ్ కూడా 2026 చివర్లో సినిమా రిలీజ్ ఉండొచ్చని హింట్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఒకవేళ సినిమా నిజంగా నవంబర్ 8న రిలీజ్ అయితే, అది పాత అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అభిమానులంతాా అధికారిక ట్రైలర్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే రిలీజ్ షెడ్యూల్‌పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

33
రామాయణం సినిమాకు పోటీ వచ్చే మూవీస్ ఇవేనా?
Image Credit : Instagram

రామాయణం సినిమాకు పోటీ వచ్చే మూవీస్ ఇవేనా?

ఒకవేళ నవంబర్ 8, 2026 తేదీ నిజమైతే, 'రామాయణం' సినిమాకు తకాషి యమజాకి 'గాడ్జిల్లా: మైనస్ జీరో' నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. ఆ సినిమా నవంబర్ 6, 2026న చాలా దేశాల్లో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు దగ్గర దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల ఐమాక్స్ (IMAX), ప్రీమియం స్క్రీన్ల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో 'రామాయణం' రెండు భాగాలుగా రాబోతోంది. 

ఈ సినిమా  భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ క్వాలిటీని ముందుగా చూసిన వాళ్లు మెచ్చుకుంటున్నారు. అందుకే జూలై 24న రాబోయే ట్రైలర్ ఈ సంవత్సరంలోనే మోస్ట్ అవైటెడ్ ఈవెంట్‌గా మారింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Krishna: ఒక్క సినిమా 20 అవకాశాలను తీసుకొచ్చింది, కృష్ణ జీవితాన్నే మార్చేసిన మూవీ ఏదో తెలుసా?
Recommended image2
Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved