MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Krishna: ఒక్క సినిమా 20 అవకాశాలను తీసుకొచ్చింది, కృష్ణ జీవితాన్నే మార్చేసిన మూవీ ఏదో తెలుసా?

Krishna: ఒక్క సినిమా 20 అవకాశాలను తీసుకొచ్చింది, కృష్ణ జీవితాన్నే మార్చేసిన మూవీ ఏదో తెలుసా?

Krishna: సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ను కంప్లీట్ గా మార్చేసిన సినిమా ఏదో తెలుసా? ఆయన సినీ జీవితంలో వరుసగా 20 అవకాశాలను తెచ్చిపెట్టినమూవీ గురించి ఎంత మందికి తెలుసు? ఇంతకీ ఆ సినిమా స్పెషల్ ఏంటి? Superstar Krishna The 1966 Classic Movie Gudachari 116 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రికార్డుల రారాజు..
Image Credit : Asianet News

రికార్డుల రారాజు..

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు దొరికిన రత్నం.. ఆయన వల్లే టాలీవుడ్ సినిమా టెక్నికల్ హంగులు అద్దుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేసిన సూపర్ స్టార్.. ఎన్నో రికార్డులు కూడా సాధించాడు. సాహసానికి మారుపేరుగా ఉండేవారు కృష్ణ. ఆయన కెరీర్ లో చేసిన ప్రయోగాలు ఎన్నో. తను నష్టపోయినా.. నిర్మాతలు బాగుండాలని కోరుకున్న హీరో కృష్ణ మాత్రమే. ఇండస్ట్రీలో కృష్ణను దేవుడు అంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర, ఏఎన్నార్ కు పోటీ ఇస్తూ..
Image Credit : Superstar Krishna\Twitter

ఎన్టీఆర, ఏఎన్నార్ కు పోటీ ఇస్తూ..

సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన అపూర్వ చిత్రం 'గూఢచారి 116'. తెలుగు సినీ రంగాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ వంటి స్టార్ హీరోలు శాసిస్తున్న రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలతో పాటు, ఆ రోజుల్లోనే సాహసోపేతమైన యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాలతో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘గూఢచారి 116’ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను.. ఆయన చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

35
'గూఢచారి 116' వెనుక అసలు కథ
Image Credit : Asianet News

'గూఢచారి 116' వెనుక అసలు కథ

దర్శకుడు మల్లికార్జునరావు తొలినాళ్లలో ప్రముఖ నిర్మాత సుందర్‌లాల్ నహతా సంస్థలో బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయన పనితనంపై నహతాకి ఎంతో నమ్మకం ఉండేది. మొదట 'శాంతి నివాసం' చిత్రానికి మల్లికార్జునరావుని దర్శకుడిగా అనుకున్నప్పటికీ, చివరి క్షణాల్లో ఆ అవకాశం వేరే దర్శకుడికి దక్కింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనప్పటికీ, ధైర్యంగా ముందుకు సాగారు. ఆ తర్వాత, కృష్ణ హీరోగా 'గూఢచారి 116' చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో నిర్మాత డూండీని ఒప్పించడం చాలా క్లిష్టమైన విషయం. మల్లికార్జునరావు గారు పట్టుబట్టి, వారిని ఒప్పించి ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు.

45
ఒక్క సినిమాతో సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్
Image Credit : Asianet News

ఒక్క సినిమాతో సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్

ఈ సాహసోపేత చిత్రం విడుదలవుతూనే బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సాధించిన సంచలన విజయం కృష్ణ సినీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే కృష్ణ ఏకంగా 20 సినిమాలకు సంతకం చేయడం విశేషం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక్క రోజే ఇన్ని చిత్రాలకు ఓ నటుడు కమిట్ కావడం ఇప్పటికీ చెరిగిపోని ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఇంత వరకూ ఈ రికార్డును ఏ హీరో బ్రేక్ చేయలేకపోయాడు.

55
టాలీవుడ్ లో కృష్ణ మార్క్..
Image Credit : facebook.com/ghattamanenisuperstar

టాలీవుడ్ లో కృష్ణ మార్క్..

టాలీవుడ్ లో తన మార్క్ చూపించుకోవడం కోసం కృష్ణ చాలా ప్రయోగాలు చేశాడు. తెలుగు పరిశ్రమను కొత్తదనం వైపు నడిపించాడు. కొత్త టెక్నాలజీలు పరిచయం చేశాడు. డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు.. రకరకాల పాత్రను ప్రయత్నించి.. తెలుగు ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Horror Movie: 25 ఏళ్ల నాటి హారర్ సినిమా OTTలో ట్రెండింగ్... ఒంటరిగా చూశారంటే అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved