ఆలియా భట్ - రణ్ బీర్ కపూర్ మధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా..? షాకింగ్ విషయం వెల్లడించిన స్టార్ హీరో
బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు ఆలియా భట్, రణ్ బీర్ కపూర్. అయితే ఆలియా భట్ ను రణ్ బీర్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిశాడో తెలుసా.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందో తెలిస్తే షాక్ అవుతారు..?
ముద్దుల కూతురికి తల్లిదండ్రులైన రణబీర్, అలియా కుటుంబ బాధ్యతలతో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కూతురి ఫోటోలు దిగుతూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్తు చేస్తుంటారు. అవి వైరల్ అవుతున్నాయి.
పెళ్లి తర్వాత రణబీర్ కపూర్ మొదటిసారిగా అలియా భట్‌ని ఎప్పుడు కలిశాడు? అప్పటికి వారి వయసు ఎంత..? ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనేది తమ అభిమానులతో పంచుకున్నారు రణ్ బీర్ కపూర్.
Image: Alia Bhatt/Instagram
రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. నేను మొదటిసారి కలిసినప్పుడు అలియా వయసు 9, నాకు 20 ఏళ్లు. అలియా భట్ నాకంటే 11 ఏళ్లు చిన్నది. అని అన్నారు రణ్ బీర్. అంతే కాదు అలియా భట్ 9 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు రణబీర్‌తో ఫోటోషూట్ కూడా చేసింది. బాల్య వివాహాలపై దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తీసిన సినిమా కోసం మా ఇద్దరికీ ఫోటోషూట్ జరిగిందని రణ్ బీర్ అన్నారు.
పెళ్లి తర్వాత జీవితం ఎలా మారిపోయిందనే దాని గురించి కూడా రణ్ బీర్ వెల్లడించారు. ఆలియా మరియు నేను ఒకరికొకరు సర్దుకుపోతున్నాము. దీనివల్ల మనం కలిసి జీవించే సామర్థ్యం పెరుగుతుంది అన్నారు. అంతే కాుద అలియా భట్ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితాన్ని చాలా చక్కగా నిర్వహిస్తుంది. నా కూతురు వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయిందని రణబీర్ అన్నారు.
నేను ఇప్పుడు ఒక కుమార్తెకు తండ్రిని. అదే నా జీవితంలో గేమ్ ఛేంజర్ పాయింట్. నేను ఇప్పుడే పుట్టినట్లు అనిపిస్తుంది. నేను మళ్ళీ పుట్టాను అంటూ తన సంతోషాన్ని వెల్లడించారు రణ్ బీర్ కపూర్. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఉన్న రణ్ బీర్ కపూర్.. ఆలియాను పెళ్ళి చేసుకుని.. కంప్లీట్ ఫ్యామిలీ మెన్ గా మారిపోయాడు.