- Home
- Entertainment
- Ranabaali Collections: పడిపోతున్న రణబాలి కలెక్షన్స్, విజయ్ దేవరకొండ సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Ranabaali Collections: పడిపోతున్న రణబాలి కలెక్షన్స్, విజయ్ దేవరకొండ సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Ranabaali Collections: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది రణబాలి సినిమా. రియల్ లైఫ్ కపుల్స్ గా విజయ్ - రష్మిక కలిసి నటించిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఈసినిమా 8 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో తెలుసా?

తగ్గుతోన్న రణబాలి కలెక్షన్స్ ..
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా నటించిన చారిత్రక చిత్రం 'రణబాలి'. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అక్టోబర్ 23 శుక్రవారం నాడు ఈ చిత్ర వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, సినిమా ఇండియాతో పాటు, ఓవర్సిస్ మార్కెట్లలో కూడా నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది.
సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. రణబాలి సినిమా ఎనిమిదో రోజున భారతదేశంలో రూ. 2.10 కోట్ల నెట్ కలెక్షన్స్ ను నమోదు చేసింది. దీనికి ముందు రోజు, అనగా గురువారం నాడు సాధించిన రూ. 3.15 కోట్ల నెట్‌తో పోలిస్తే ఇది సుమారు 33.3 శాతం తగ్గుదలని చూపించింది. ఎనిమిదో రోజున ఈ సినిమా మొత్తం 1,471 షోలలో ప్రదర్శించబడగా, ఒక్కో షోకి సగటున రూ. 14,276 వసూలు అయినట్లు తేలింది.
ఓవర్సిస్ లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సిస్ కలెక్షన్స్ తో పాటు అంతర్జాతీయ వ్యాపారం కలుపుకుని ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ. 66.45 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 11.45 కోట్లుగా ఉన్నాయి. ఈ సినిమాపై జైలర్ 2 ప్రభావం కూడా కనిపిస్తోంది. పాన్ ఇండియా తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రణబాలిపై రజినీకాంత్ ప్రభావం ఉంది. ఈ సినిమా పోటీకి లేకుంటే.. రణబాలి వసూళ్లు భారీగా పెరిగి ఉండేవి అని అభిమానులు అంచనా వేస్తున్నారు.
భారీ ఓపెనింగ్స్ తో మొదలై...
అక్టోబర్ 16న థియేటర్లలో అడుగుపెట్టిన 'రణబాలి' తన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 9.25 కోట్లతో భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఆ తర్వాత వీకెండ్ లో మొదటి శనివారం రోజున రూ. 7.30 కోట్లు, ఆదివారం రోజున రూ. 7.50 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత సోమవారం రోజున కలెక్షన్స్ రూ. 5.40 కోట్లకు పడిపోగా, మంగళవారం రోజున మళ్లీ పుంజుకుని రూ. 7.10 కోట్లను రాబట్టింది. ఆ తర్వాత బుధవారం నాడు రూ. 5.50 కోట్లు, గురువారం నాడు రూ. 3.15 కోట్లు సాధించడంతో, ఈ సినిమా మొదటి వారం భారతదేశ నెట్ కలెక్షన్స్ రూ. 45.20 కోట్లకు చేరుకున్నాయి.
రెండవ శుక్రవారం నాటి షోల ద్వారా ఈ సినిమా 1,85,175 మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. దీనితో సినిమా థియేట్రికల్ రన్‌లో మొత్తం ప్రేక్షకుల సంఖ్య (ఫుట్‌ఫాల్స్) 3,769,242కి చేరుకుంది. మునుపటి రోజులతో పోలిస్తే తక్కువ షోలలో ప్రదర్శించబడినప్పటికీ, 'రణబాలి' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

