MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SPB: ఆ పాట పాడేటప్పుడు నరకం చూశా.. రికార్డింగ్ మధ్యలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఏమైందంటే?

SPB: ఆ పాట పాడేటప్పుడు నరకం చూశా.. రికార్డింగ్ మధ్యలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఏమైందంటే?

SPB: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ సినిమాలోని పాట రికార్డింగ్ టైమ్‌లో గొంతు సమస్యతో ఎంతలా ఇబ్బంది పడ్డారో, ఆపరేషన్‌కు ముందు ఆయన పడిన టెన్షన్ ఏంటో పాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 24 2026, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమరగాయకుడు..
Image Credit : others

అమరగాయకుడు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SPB).. తన మధురమైన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ సింగర్. దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన ఆయన, తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ఒక పాట రికార్డింగ్ టైమ్‌లో గొంతు సమస్య వల్ల ఆయన పడిన కష్టాన్ని వివరించిన తీరు అందరినీ కదిలిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
'ఓ పాప లాలీ' పాడేటప్పుడు గొంతు సహకరించలేదు!
Image Credit : others

'ఓ పాప లాలీ' పాడేటప్పుడు గొంతు సహకరించలేదు!

తన సుదీర్ఘమైన మ్యూజిక్ జర్నీలో ఎస్పీబీ లెక్కలేనన్ని అద్భుతమైన పాటలు పాడారు. కానీ, కొన్ని పాటలు రికార్డ్ చేసేటప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన 'గీతాంజలి' సినిమా పాటల రికార్డింగ్ టైమ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలు ఓ పాత ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

'గీతాంజలి'లోని 'ఓ పాప లాలీ' పాటను తెలుగు, మలయాళం భాషల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు తన గొంతు అస్సలు సహకరించలేదని ఆయన చెప్పారు. వోకల్ కార్డ్స్ (గొంతు నరాలు) సమస్య వల్ల పాడటానికి చాలా ఇబ్బంది పడ్డారట. ఒక్కో పదాన్ని స్పష్టంగా పలకడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. దీంతో రికార్డింగ్ మధ్యలోనే బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పాటను సరిగ్గా పాడలేకపోవడంతో తనపై తనకే కోపం, చిరాకు వచ్చేవని బాలు చెప్పారు. ఆ టైమ్‌లో తాను పడిన బాధను నరకంతో పోల్చారు. ప్రాణంగా ప్రేమించే సంగీతాన్ని పాడలేక, సొంత గొంతే సహకరించక ఒక సింగర్ పడే మానసిక వేదన ఎంతలా ఉంటుందో చెప్పడానికి ఆయన అనుభవమే ఒక ఉదాహరణ.

34
ఇంట్లో కూడా ప్రశాంతత లేదు!
Image Credit : facebook.com/SPB

ఇంట్లో కూడా ప్రశాంతత లేదు!

గొంతు సమస్య ఒకవైపు ఉంటే, ఆ రోజుల్లో ఇంట్లో కూడా తనకు ప్రశాంతత కరువైందని ఎస్పీబీ గుర్తుచేసుకున్నారు. మూఢనమ్మకాల వల్ల ఇంట్లో వాళ్లు పూజలు చేయాలని బలవంతం చేసేవారట. తనకు ఇష్టం లేకపోయినా వాళ్లు వినేవారు కాదని చెప్పారు.

దాదాపు నాలుగు నెలల పాటు ఈ సమస్య ఆయన్ని వేధించింది. రోజూ పాటల రికార్డింగ్ కోసం కాల్స్ వచ్చేవి. కానీ, తాను పాడలేనని నిర్మాతలకు చెప్పడం ఆయనకు పెద్ద సవాల్‌గా మారింది. చివరకు తన పరిస్థితిని వివరించి, తన కోసం వెయిట్ చేయొద్దని, కావాలంటే వేరే సింగర్స్‌తో పాడించుకోమని నిర్మాతలకు చెప్పేశారట.

'ఆపరేషన్ చేయించుకోవద్దు' అన్న లతా మంగేష్కర్!

గొంతు సమస్యకు ట్రీట్‌మెంట్ తీసుకునే విషయంలో కూడా బాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. డాక్టర్లు సర్జరీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, సర్జరీ చేస్తే గొంతు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉందని కొందరు భయపెట్టారు. సరిగ్గా అదే టైమ్‌లో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ గారు బాలుకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారట.

గొంతు సమస్య గురించి విన్నాక, సర్జరీ మాత్రం చేయించుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు. గొంతుకు సంబంధించిన చిన్న కణజాలం దెబ్బతిన్నా పాడే సామర్థ్యం పోతుందేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారట. కానీ, అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత ఎస్పీబీ సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయించుకున్నారు.

44
ఆపరేషన్ తర్వాత గొంతు విని ఆశ్చర్యపోయిన బాలు!
Image Credit : facebook

ఆపరేషన్ తర్వాత గొంతు విని ఆశ్చర్యపోయిన బాలు!

ఎట్టకేలకు ఎస్పీబీకి సర్జరీ సక్సెస్ అయింది. స్పృహలోకి వచ్చాక తన గొంతును టెస్ట్ చేసుకుంటే, మునుపటి కంటే చాలా ఈజీగా పాడగలుగుతున్నానని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు, అలాగే చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు. చాలా రోజులుగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడటం ఆయనలో కొత్త ఆశలు నింపింది.

తన కెరీర్ స్టార్టింగ్‌లో పాడిన పాటలు వింటే కొన్నిసార్లు తనకే చిరాకు వస్తుందని బాలు సరదాగా చెప్పారు. అప్పట్లో అంతంతమాత్రంగా పాడినా ఇండస్ట్రీ తనను ఎలా భరించి అవకాశాలు ఇచ్చిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

లతా మంగేష్కర్, పి. సుశీల గారి నుంచి నేర్చుకున్న పాఠం 

ఆ ఇంటర్వ్యూలో బాలు గారు లతా మంగేష్కర్, పి. సుశీల లాంటి లెజెండరీ సింగర్స్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, పదాలను స్పష్టంగా పలికే వారి విధానం నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పటి తరం సింగర్స్ పాటల్లో అక్షరాల స్పష్టతకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆయన బాధపడ్డారు. పాటల్లో పదాలను స్పష్టంగా పలకడం కంటే, వాటిని సాగదీసి పాడటమే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

వేలాది పాటలతో సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఈ అనుభవం, ఒక సింగర్ కెరీర్‌లో ఎదురయ్యే కష్టాలను కళ్లకు కడుతుంది. గొంతు సమస్య వచ్చినా ధైర్యం కోల్పోకుండా ఆయన దాన్ని ఎదుర్కొన్న తీరు నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss telugu 10: ముకేష్ గౌడ Vs శివ, ఇద్దరి మధ్య రగిలిన గొడవ, ముఖేష్ తీరుపై విమర్శలు..
Recommended image2
Auto Ram Prasad: రామ్ ప్రసాద్ కు అన్యాయం, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెన్నుపోటు పొడిచారా?
Recommended image3
Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే
Related Stories
Recommended image1
Strange Village: అక్కడ ఊరి బయటే మహిళల బతుకు.. ఆ ఐదు రోజులు ప్రాణాలు అరచేతిలోనే!
Recommended image2
తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved