- Home
- Entertainment
- బ్లూ ఫిలింలో నటించమని ఆఫర్ ఇచ్చారు..చీర కట్టుకున్న ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు, నటి రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్
బ్లూ ఫిలింలో నటించమని ఆఫర్ ఇచ్చారు..చీర కట్టుకున్న ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు, నటి రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్
అప్పట్లో ఐటెం సాంగ్స్ లో, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించే నటీమణులు చాలా తక్కువగా కనిపిస్తారు. ఒక వేళ ఎవరైనా ఉన్నపటికీ విమర్శలని, సూటిపోటి మాటలని భరిస్తూ నిలబడగలగాలి.

ramyasri
అప్పట్లో ఐటెం సాంగ్స్ లో, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించే నటీమణులు చాలా తక్కువగా కనిపిస్తారు. ఒక వేళ ఎవరైనా ఉన్నపటికీ విమర్శలని, సూటిపోటి మాటలని భరిస్తూ నిలబడగలగాలి. అలాంటి నటీమణుల్లో రమ్యశ్రీ ఒకరు. ఎన్నో చిత్రాల్లో రమ్యశ్రీ బోల్డ్ గా నటించింది. వ్యాంప్ తరహా రోల్స్ చేసింది.
నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలయింది లాంటి చిత్రాల్లో రమ్యశ్రీ నటించింది. కొన్ని చిత్రాల్లో ఆమె సోలోగా హాఫ్ న్యూడ్ గా కూడా నటించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొందట. కొందరు తనని వాడుకోవాలని కూడా చూశారని.. ఇంకొందరు కారులోనే బలవంతం చేయబోయారని రమ్య శ్రీ తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఏదైనా ఈవెంట్స్ కి నన్ను పిలవాలంటే కూడా.. ఆమె ఎందుకు అసభ్యంగా బట్టలు వేసుకుంటుంది అని విమర్శించేవారట. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాను నన్ను నమ్మి తీసుకున్న దర్శకులకు న్యాయం చేయాలి. సినిమా బాగా రావాలంటే దర్శకుడు కోరిన విధంగా బట్టలు వేసుకోవాలి అని రమ్య శ్రీ పేర్కొంది.
ఒకసారి అమెరికాలో ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి ముందు నుంచి నన్ను పిలవాలని అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆమె బట్టలు దారుణంగా వేసుకుంటుంది.. వద్దు అని అన్నట్లు నాకు తెలిసింది. కొంతమంది ఇంకా బట్టలు ఏంటి.. ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ చేశారట. మొత్తంగా నన్ను ఇన్వైట్ చేశారు.
ఆ ఈవెంట్ లో నా బిహేవియర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సినిమాల్లో అలా కనిపిస్తారు.. కానీ ఇక్కడ ఇంత డీసెంట్ గా ఉన్నారు అంటూ ప్రశంసించారు. ఆ ఈవెంట్ లో చాలా మంది కూర్చుని డిన్నర్ చేస్తున్నాం. ఒక పెద్దాయన లేచి నన్ను ఉద్దేశిస్తూ.. అందరికీ చెప్పారు. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు అని చెప్పాడు. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదు అని అన్నారు.
మరొక విషయం ఏంటంటే.. నాకు బ్లూ ఫిలిమ్స్ లో నటించమని ఆఫర్స్ వచ్చాయి. బ్లూ ఫిలిమ్స్ చేసేవాళ్ళు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. నేను చేయనంటే చేయను అని లాయర్ ని పెట్టుకుని మరీ వాదించాను. అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను అని రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను డైరెక్టర్ కోసం సినిమాల్లో పొట్టి బట్టలు వేసుకుంటా. అంతమాత్రాన ఇలాంటి పనులు చేయను అని రమ్యశ్రీ అన్నారు.