నరేష్-పవిత్ర ఎలా కలిసుంటారో చూస్తా... రమ్య రఘుపతి శబధం!
నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి ట్రైయాంగిల్ డ్రామాకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఈ వివాదం అంతకంతకూ పెద్దది అవుతుంది. నాకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో నరేష్ ఎలా కలిసుంటారో చూస్తానంటుంది రమ్య.

Naresh Babu Pavitra Lokesh Ramya Raghupathi
గత వారం రోజులుగా పవిత్ర లోకేష్, నరేష్ (Naresh)లతో రమ్య రఘుపతికి మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. నిన్న మైసూర్ లోని ఓ హోటల్ లో పెద్ద హైడ్రామా నడిచింది. నరేష్, పవిత్ర లోకేష్ హోటల్ గదిలో ఉన్నారని తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడకు వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టి వాళ్ళను బయటికి పిలిచే ప్రయత్నం చేశారు.
రమ్య రాకను పసిగట్టిన నరేష్ సమాచారం ఇవ్వడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. ఇక హోటల్ గది నుండి బయటకు వచ్చిన నరేష్, పవిత్ర(Pavitra Lokesh)లను రమ్య దూషించారు. చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని వారిని అక్కడ నుండి తరలించారు. ఈ హైడ్రామా మొత్తాన్ని మీడియా కవర్ చేసింది.
Naresh-Pavitra Lokesh
కాగా నరేష్, పవిత్ర లోకేష్ ఎలా కలిసుంటారో చూస్తానంటూ రమ్య(Ramya Raghupathi) శబధం చేస్తున్నారు. నాకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో నరేష్ ఎలా సహజీవనం చేస్తాడని ఆమె ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నా వదిలేది లేదంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే వ్యవహారం మరింత పెద్దది అయ్యేలా ఉంది.
మరోవైపు పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకునే విషయంపై నరేష్ స్పందించారు. ప్రస్తుతానికి నేను నడి సముద్రంలో ఉన్నాను. పవిత్రను పెళ్లి చేసుకునేది లేనిది చెప్పలేను. అలంటి ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేస్తాను, అన్నారు.
ఇక తాళి ఒక లైసెన్సు మాత్రమే. పది జంటల్లో ఎనిమిది నుండి తొమ్మిది జంటలు విడిపోతున్నారు. కాబట్టి వివాహం అనేది తప్పనిసరి కాదు. మనం విశ్వసించే వ్యక్తులతో ప్రయాణం చేయడమే అన్నారు. పవిత్ర లోకేష్ తో సహజీవనానికే ఆయన మొగ్గుచూపుతున్నట్లు కామెంట్స్ ద్వారా తెలుస్తుంది.