సౌందర్య నటన చూసి ఓర్వలేకపోయిన టాప్ హీరోయిన్, ఆ మూవీ వల్ల భార్యాభర్తల మధ్య గొడవ ?
సౌందర్య నటన వల్ల సెలబ్రిటీ కపుల్స్ మధ్య గొడవ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో సౌందర్య లెజెండ్రీ నటి అని చెప్పడంలో సందేహం లేదు. ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.

Soundarya
సౌందర్య నటన వల్ల సెలబ్రిటీ కపుల్స్ మధ్య గొడవ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో సౌందర్య లెజెండ్రీ నటి అని చెప్పడంలో సందేహం లేదు. ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసింది. ఎన్నో చిత్రాల్లో సౌందర్య అద్భుతమైన నటనతో మెప్పించింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

సౌందర్య కెరీర్ లో మెమొరబుల్ మూవీస్ లో అంతఃపురం ఒకటి. 1998లో ఈ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో జగపతి బాబు, సౌందర్య, ప్రకాష్ రాజ్ పోటీ పడి నటించారు. ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ వల్ల మీకు, రమ్యకృష్ణకి గొడవ జరిగిందట నిజమేనా అని యాంకర్ ప్రశ్నించారు.
సౌందర్య నటన చూసి రమ్యకృష్ణ వెంటనే కృష్ణవంశీతో గొడవ పెట్టుకుందట. ఈ చిత్రంలో నన్నెందుకు తీసుకోదు అని రమ్యకృష్ణ ప్రశ్నించిందట. ఇది నిజమేనా అని యాంకర్ అడగగా.. అది మా భార్య భర్తల మధ్య సమస్య.. మీకెందుకు అని అన్నారు.
ఆ చిత్రం గురించి రమ్యకృష్ణ మాట్లాడింది కాబట్టి సమాధానం కూడా ఆమెనే అడగండి అని కృష్ణవంశీ తెలిపారు. రమ్యకృష్ణ, సౌందర్య కలసి నటించిన అద్భుతమైన చిత్రం ఒకటి ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహాలో రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో నటించగా.. సౌందర్య హీరోయిన్ గా నటించారు.