MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాల నుంచి తొలగించారని స్టేజ్‌పైనే రమ్యకృష్ణ కన్నీళ్లు.. `అల్లరి మొగుడు`కి ముందు ఆమె కెరీర్‌లో ఏం జరిగింది?

సినిమాల నుంచి తొలగించారని స్టేజ్‌పైనే రమ్యకృష్ణ కన్నీళ్లు.. `అల్లరి మొగుడు`కి ముందు ఆమె కెరీర్‌లో ఏం జరిగింది?

రమ్యకృష్ణ కెరీర్‌ ప్రారంభంలో దారుణంగా సాగిందట. ఆమెని దురదృష్టవంతురాలు అని పిలిచేవారట. నిర్మాతలో సినిమాల్లోకి తీసుకుని తొలగించారని చెప్పి షాకిచ్చింది రమ్యకృష్ణ.  

3 Min read
Author : Aithagoni Raju
Published : May 21 2024, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఒకప్పుటి స్టార్‌ హీరోయిన్ రమ్యకృష్ణన్‌.. ఇప్పుడు విలక్షణ పాత్రలతో మెప్పిస్తుంది. `నరసింహా`(తమిళం)లో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్‌ని ఓ మలుపు తిప్పితే, ఆ తర్వాత `బాహుబలి` రమ్యకృష్ణ కెరీర్‌ని మరో టర్న్ తిప్పింది. హీరోయిన్‌గా ఎన్ని సూపర్‌ హిట్లు వచ్చినా, ఈ సినిమాల్లో రమ్యకృష్ణ నటన నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది రమ్యకృష్ణ. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ప్రస్తుతం ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. బలమైన పాత్రలు మాత్రమే చేస్తుంది. పెద్ద సినిమాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది. వెయిట్‌ ఉన్న పాత్రలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలో రమ్యకృష్ణ చెప్పిన కొన్ని విషయాలు, ఆమె కెరీర్‌ పరంగా బయటకు వచ్చిన విషయాలు షాకిస్తున్నాయి.
 

310

రమ్యకృష్ణ కెరీర్‌ 1983లో తమిళ చిత్రం ద్వారా ప్రారంభమైంది. 84లో `కాంచు కాగడ` చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. కొన్నాళ్లపాటు సినిమాల్లో క్యారెక్టర్‌గానే చేసింది. జస్ట్ ఓ రోల్‌ నుంచి సెకండ్‌ హీరోయిన్‌, ఆ తర్వాత హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. తమిళంలో, తెలుగులో పారలల్‌గా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ సరైన హిట్లు లేవు, బ్రేక్‌ లేదు. అక్కినేని హీరోలతోనూ చేసింది. కానీ పెద్ద సినిమాలు పడలేదు. ఫెయిల్యూర్సే ఎక్కువగా దర్శనమిచ్చాయి. 
 

410

ఆ సమయంలో చాలా మంది నిర్మాతలు తనని హీరోయిన్‌గా బుక్‌ చేసుకుని రిజెక్ట్ చేసేవాళ్లట. మరో హీరోయిన్‌ని తీసుకునేవాళ్లట. సినిమా అంటే సక్సెస్‌. సక్సెస్‌ వెంట పరుగెడుతుంది. సక్సెస్‌ ఉన్న హీరోయిన్లనే తీసుకునేవాళ్లట. అలా చాలా సినిమాలు కోల్పోయిందట. వరుసగా చాలా మంది మేకర్స్ ఓకే చేశాక వద్దనే వారట. ఈ క్రమంలో తెలుగులో ఆఫర్లు తగ్గిపోతున్న సమయంలో కె రాఘవేంద్రరావు ఆమెకి లైఫ్‌ ఇచ్చాడు. 
 

510

ఓ సందర్భంలో రమ్యకృష్ణ తన ఆయన ముందు వ్యక్తం చేసిందట. దీంతో ఆమె సినిమాలు చూసినప్పుడు ప్రారంభంలో చేసిన ఓ మూవీలో రమ్యకృష్ణ నటన, ఎక్స్ ప్రెషన్స్ పట్టుకున్నాడట. ఆమెని ఎలా చూపిస్తే బాగుంటుందో దానిపై ఫోకస్‌ పెట్టాడట. అలా 1990లో `అల్లుడుగారు` సినిమాకి ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. అందులో రెండో హీరోయిన్‌గానే. అయినా అదిరిపోయే పాత్ర పడింది. మోహన్‌బాబుకి జోడీగా చేసి మెప్పించింది. రమ్యకృష్ణ అందరి చూపుని ఆకర్షించింది. పేరొచ్చింది. 

610

ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ రమ్యకృష్ణతో సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆ వెంటనే `అల్లరి మొగుడు` చేశాడు. అది పెద్ద హిట్‌. రమ్యకృష్ణకి తెలుగులో పెద్ద బ్రేక్‌. సినిమా వంద రోజులు ఆడింది. ఆ సందర్భంగా 100రోజుల వేడుక నిర్వహించారు. ఇందులో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ సక్సెస్‌కి కారణం కె రాఘవేంద్రరావు అని తెలిపింది. తనని చాలా మంది దురదృష్టవంతురాలు అనేవారు.
 

710

అంతేకాదు కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, చాలా సార్లు జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఇంతటి విజయాన్ని అందించారని రమ్యకృష్ణ రాఘవేంద్రరావు, హీరో మోహన్‌బాబు, నిర్మాతకు థ్యాంక్స్ చెప్పింది. ఈ క్రమంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్‌ ఇవ్వలేని పరిస్థితి ఆమె వెనుతిరిగింది. 

810

ఆ సమయంలో చాలా సేపు రమ్యకృష్ణ భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయిందని రాఘవేంద్రరావు తెలిపారు. ఇదంతా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానాన్ని తెలియజేసేలా సాగే `సౌందర్యలహరి` షోలో రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇవాళ్ల తనని కాదనుకున్నవాళ్లు, తొలగించినవాళ్లు మళ్లీ నువ్వే కావాలి అని అనేలా చేస్తాను అని ఆ సమయంలోనే రమ్యకృష్ణకి చెప్పాడట. 
 

910

`అల్లుడుగారు`లో ప్రత్యేకంగా శ్రద్దపెట్టి ఆమె పాత్రని డిజైన్‌ చేసినట్టు చెప్పారు రాఘవేంద్రరావు. అది చేసి చూపించారు. రమ్యకృష్ణ ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయ్యారు. ఇప్పుడు సీనియర్‌ నటిగానూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానూ అదే స్థాయిలో ఉన్నారు. 
 

1010

ఇక రాఘవేంద్రరావు లేకపోతే తాను సిస్టర్, మదర్‌ పాత్రలు చేస్తూ ఉండిపోయేదాన్ని అని, లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఏదో పని చేసుకునేదాన్ని అని వెల్లడించింది రమ్యకృష్ణ. తనకు గుర్తింపు, ఇమేజ్‌, సక్సెస్‌ వచ్చిందంటే అది రాఘవేంద్రరావు వల్లే అని, దానికి సంబంధించిన క్రెడిట్‌ ఆయనకే దక్కుతుందని వెల్లడించింది రమ్యకృష్ణ. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image3
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved