- Home
- Entertainment
- ప్రభాస్, మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్స్ చేసి వారికే తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. మూవీ నుంచి ఒక సాంగ్ డిలీట్
ప్రభాస్, మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్స్ చేసి వారికే తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. మూవీ నుంచి ఒక సాంగ్ డిలీట్
హీరోయిన్లు తమ కెరీర్ లో భాగంగా అన్ని రకాల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. కథకు తగ్గట్లుగా తమను తాము మార్చేసుకుని ఆ పాత్రల్లో కొందరు హీరోయిన్లు ఒదిగిపోతుంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us

హీరోయిన్లు తమ కెరీర్ లో భాగంగా అన్ని రకాల పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. కథకు తగ్గట్లుగా తమను తాము మార్చేసుకుని ఆ పాత్రల్లో కొందరు హీరోయిన్లు ఒదిగిపోతుంటారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అయితే ఆల్ రౌండర్ అనే చెప్పాలి. గ్లామర్ గా కనిపించినా, పొగరుబోతు అమ్మాయిగా నటించినా, ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించినా ఇలా అన్ని రకాల పాత్రలు చేయడం ఆమెకే చెల్లింది.
అందుకే రమ్యకృష్ణ దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు ప్రస్తుతం రమ్యకృష్ణ కి హీరోయిన్ గా నటించే వయస్సు లేనప్పటికీ బాహుబలి చిత్రంలో శివగామి లాంటి అద్భుతమైన పాత్రలు ఆమెకు దక్కుతున్నాయి. ప్రస్తుతం రమ్యకృష్ణ తల్లి, అత్త తరహా పాత్రల్లో రాణిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో రమ్యకృష్ణ విచిత్రమైన కాంబినేషన్స్ లో నటించింది. రమ్యకృష్ణ చాలా ఏళ్ల క్రితం వీళ్లిద్దరి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. అప్పట్లో టాలీవుడ్ లో రమ్యకృష్ణ గ్లామర్ క్వీన్ గా ఉండేవారు. దీంతో ఆమెకి స్పెషల్ సాంగ్స్ లో కూడా అవకాశాలు వచ్చేవి. ప్రభాస్ అడవి రాముడు చిత్రంలో రమ్యకృష్ణ 'జంటను విడదీసే' అనే స్పెషల్ సాంగ్ లో నటించారు.
కానీ ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ప్రభాస్ కి తల్లిగా నటించడం విశేషం. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. ఇలాంటి కాంబినేషన్ మహేష్ బాబుతో కూడా రిపీట్ అయింది. మహేష్ బాబు 'నాని' చిత్రంలో రమ్యకృష్ణ 'మార్కండేయ' అనే స్పెషల్ సాంగ్ చేసింది. గ్లామరస్ గా కనిపిస్తూ మహేష్ బాబుతో డాన్స్ అదరగొట్టింది. కానీ ఈ సాంగ్ ని థియేటర్ రిలీజ్ నుంచి డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
మహేష్ తో స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. గుంటూరు కారం చిత్రంలో అతడికి తల్లిగా నటించింది.అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఏ పాత్రలో కనిపించినా ఆ పాత్రకి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడం రమ్యకృష్ణ ప్రత్యేకత.