- Home
- Entertainment
- Soundarya: నన్ను మించిపోతున్న సౌందర్యతో ఆ సినిమా చేయకూడదనుకున్నా, కానీ.. అది ఐకానిక్ రోల్ అవుతుందని తెలియదు
Soundarya: నన్ను మించిపోతున్న సౌందర్యతో ఆ సినిమా చేయకూడదనుకున్నా, కానీ.. అది ఐకానిక్ రోల్ అవుతుందని తెలియదు
ఒక దశలో సౌందర్య తనని మించిపోయింది అని రమ్యకృష్ణ పేర్కొన్నారు. అలాంటి సౌందర్య సినిమాలో తాను నెగిటివ్ రోల్ లో నటించకూడదు అని అనుకున్నట్లు కూడా రమ్యకృష్ణ రివీల్ చేశారు.

Ramya Krishna
రమ్యకృష్ణ గతంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఆమె అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసిన రమ్యకృష్ణ.. నెగిటివ్ రోల్స్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఆమె నెగిటివ్ రోల్ లో నటించిన రజినీకాంత్ నరసింహ మూవీ క్లాసిక్ అయింది. ఆమె నీలాంబరి పాత్ర ఐకానిక్ అయింది.
నెగిటివ్ రోల్ లో అవకాశం
ముందుగా తనకు నీలాంబరి రోల్ చేయడం ఇష్టం లేదు అని రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దానికి కారణం సౌందర్యే అని అన్నారు. నరసింహ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నాది నెగిటివ్ రోల్ అని చెప్పారు. దర్శకుడు ఎంత బాగా తీసినా, రచయిత ఎంత బాగా రాసినా, నేను ఎంత బాగా నటించినా నెగిటివ్ రోల్ అంటే నెగిటివ్ రోలే.
సౌందర్య నన్ను మించిపోయింది
అదీ కాక ఆ టైంలో సౌందర్య నన్ను మించిపోయేలా సినిమాలు చేస్తోంది. అమ్మోరు సినిమా నుంచి సౌందర్య ఎదగడం చూస్తున్నా. కొద్ది కాలానికే నా కళ్ళముందే ఎదుగుతూ నన్ను మించిపోయేలా సినిమాలు చేసింది. చాలా అద్భుతమైన పాత్రలు చేసింది. అలాంటప్పుడు సౌందర్య హీరోయిన్ గా ఉన్న సినిమాలో నేను విలన్ గా చేయాలా అనే ఫీలింగ్ నాకు ఉంది. లేదు అని చెప్పలేను.
ఐకానిక్ రోల్ అంటున్నారు
ఆ ఫీలింగ్ తోనే ఇష్టం లేకుండా ఆ చిత్రానికి ఒప్పుకున్నా. కానీ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం నా బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు అందరూ దానిని ఐకానిక్ రోల్ అని అంటున్నారు అంటూ రమ్యకృష్ణ అభిప్రాయ పడింది.
బాహుబలి కూడా రిజెక్ట్ చేశా
బాహుబలిలో శివగామి పాత్ర చేస్తున్నప్పుడు కూడా అది ఐకానిక్ అవుతుందని తెలియదు. శోభుగారు బాహుబలి కోసం ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసినప్పుడు సినిమా గురించి నాకేమీ తెలియదు. 40 రోజులు డేట్లు కావాలి అని అడిగారు. ఆ టైంలో నేను నా కొడుకుతో, సీరియల్స్ తో బిజీగా ఉన్నాను. కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేశా. ఆ తర్వాత రాజమౌళి ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద సినిమా చేస్తున్నారు అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. వాటిని మా నాన్న బాగా ఫాలో అవుతారు. ఏంటి నువ్వు చేసింది రాజమౌళి సినిమాని ఎందుకు ఒప్పుకోలేదు అని తిట్టారు. అప్పుడే శోభుగారు మరోసారి ఫోన్ చేసి సినిమా గురించి చెప్పారు. ఆ విధంగా శివగామి పాత్రకు తాను ఒప్పుకున్నట్లు రమ్యకృష్ణ పేర్కొన్నారు.






